శ్రీలంక అధ్యక్ష బరిలో రాజపక్స వారసుడు

by M.Rajitha |
శ్రీలంక అధ్యక్ష బరిలో రాజపక్స వారసుడు
X

దిశ, వెబ్ డెస్క్ : శ్రీలంక అధ్యక్ష బరిలోకి రాజపక్స కుటుంబ వారసుడు అనూహ్యంగా పోటీలోకి వచ్చారు. సెప్టెంబర్ 21న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో రాజపక్స కుమారుడు నమల్ రాజపక్స పోటీ చేయబోతున్నాడు. ఎస్ఎల్పీపీ పార్టీ తరపున దేశ అధ్యక్ష అభ్యర్థిగా నిలబడబోతున్నట్టు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వెల్లడించారు. ప్రస్తుత అధ్యక్షుడు విక్రమసింఘే, ప్రతిపక్ష నేత సజిత ప్రేమదాస, జీవిపీ నాయకుడు అరుణ కుమార దిశనాయకే తోపాటు ఇపుడు నమల్ రాజపక్స కూడా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్నారు.

2022 ఏప్రిల్ లో శ్రీలంక ప్రభుత్వం అప్పులు చెల్లించలేక చేతులు ఎత్తేసిన నేపథ్యంలో దేశవ్యాప్త ఆందోళనలు , అధ్యక్ష భవనం ఆక్రమణలు జరిగాయి. అప్పుడు అధ్యక్ష పదవిలో ఉన్న గొటబయ తన పదవికి రాజీనామా చేయగా, విక్రమ సింఘే అధికారం చేపట్టారు. అయితే తాజాగా ఎస్ఎల్పీపీకి చెందిన దాదాపు 100 మంది ఎంపీలు రాజపక్సకు మద్దతుగా నిలవడంతో నమల్ పేరు తెరమీదకి వచ్చింది. న్యాయశాస్త్రం చదివిన నమల్ రాజపక్స 2010 నుండి ఎంపీగా ఉన్నారు. కేబినెట్ మినిస్టర్ గా పనిచేసిన అనుభవం కూడా ఉండటంతో రాజపక్స కుటుంబం అధ్యక్ష బరిలో నమల్ ను నిలబెడుతున్నట్టు సమాచారం.

Next Story

Most Viewed