అమెరికా రాజధానిలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు సన్నాహాలు..

by Vinod kumar |
అమెరికా రాజధానిలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు సన్నాహాలు..
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా ఆదివారం అమెరికా రాజధాని డీసీలో జరగబోతున్న సన్నాహక సమావేశం ఏర్పాట్లను తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుమారు 2,000 పైచిలుకు అన్న గారి అభిమానులు, కుటుంబ సమేతంగా పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, గౌరవ అతిధులుగా జయరాం కోమటి, మన్నవ సుబ్బారావు హాజరు కాబోతున్నారని తెలిపారు.


స్వతహాగా భోజన ప్రియుడైన అన్న గారి శత జయంతి కార్యక్రమంలో.. విదేశాలలో మొదటి సారిగా అచ్చమైన 100 రకాల తెలుగింటి సంప్రదాయ వంటకాలను సిద్ధం చేయనున్నారు. హాజరయ్యే అభిమానులకు, మహిళలకు, చిన్నారులకు అందించాలని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుధీర్ కొమ్మి, అనిల్ ఉప్పలపాటి, యశస్వి బొద్దులూరి, సాయి బొల్లినేని,కార్తీక్ కోమటి, భాను మాగులూరి, రవి అడుసుమిల్లి, యలమంచిలి చౌదరి, యువ సిద్దార్ధ్ బోయపాటి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed