బ్రేకింగ్: ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్ క్రాష్.. తీవ్ర ఇబ్బందులు పడుతోన్న యూజర్స్!

by Nagaya |
బ్రేకింగ్: ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్ క్రాష్.. తీవ్ర ఇబ్బందులు పడుతోన్న యూజర్స్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: టెస్లా అధినేత ఎలన్ మస్క్ చేజిక్కించుకున్న ప్రముఖ సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్ క్రాష్ అయింది. ట్విట్టర్లో సాంకేతిక లోపం తలెత్తినట్లు తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం నుంచి ట్విట్టర్‌ను ఓపెన్ చేయలేక యూజర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక దేశాల్లో ట్విట్టర్ సేవలకు అంతరాయం ఏర్పడింది. బుధవారం మధ్యాహ్నం 3.50 గంటల సమయంలో ఈ సమస్య ఎదురైనట్లు తెలుస్తోంది. ఖాతా ఫీడ్‌లో ఉండే ట్వీట్లు సైతం కనిపించడం లేదని యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు.

ఇందుకు కారణమేంటని ఇంకా తెలియడం లేదు. అవుట్‌టేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ 'డౌన్ డిటెక్టర్' ప్రకారం ట్విట్టర్ క్రాష్‌కు సంబంధించి వేలాది కంప్లైంట్స్ వచ్చాయి. కాగా, గత కొన్ని నెలలుగా ట్విట్టర్లో అనేక అంతరాయాలు తలెత్తున్నాయి. ప్రస్తుతం #TwitterDown హ్యాష్‌ట్యాగ్ ప్లాట్‌ఫారమ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఫన్నీ ట్వీట్స్ చేస్తూ మస్క్‌కు, ట్విట్టర్‌కు యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు. దీనిపై ట్విట్టర్ ఇప్పటివరకు స్పందించలేదు.

Advertisement

Next Story

Most Viewed