ఈజిప్టులోని అల్ హకీమ్ మసీదును సందర్శించనున్న ప్రధాని మోడీ

by Javid Pasha |   ( Updated:2023-06-19 10:30:24.0  )
ఈజిప్టులోని అల్ హకీమ్ మసీదును సందర్శించనున్న ప్రధాని మోడీ
X

కైరో : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూన్ 24, 25 తేదీల్లో ఈజిప్ట్‌లో పర్యటించనున్నారు. 2023 జనవరిలో ఢిల్లీలో భారత గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంలో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్సీసీ.. మోడీని కలిసి తమ దేశానికి రావాలని ఆహ్వానించారు. ఈ ఆహ్వానం మేరకు ఈజిప్టుకు వెళ్తున్న మోడీ.. ఓల్డ్ కైరోలోని చారిత్రక అల్ హకీమ్ మసీదును సందర్శించనున్నారు. ఈ మసీదుకు దాదాపు 1,000 సంవత్సరాల చరిత్ర ఉంది. దావూదీ బోహ్రా కమ్యూనిటీ సహాయంతో గత ఆరేళ్ళ వ్యవధిలో(2017-2023) అల్ హకీమ్ మసీదు పునరుద్ధరణ పనులు పూర్తి చేశారు.

ఆరో ఫాతిమిద్ ఖలీఫ్ పేరును ఈ మసీదుకు పెట్టారు. కైరో సిటీ నడిబొడ్డున ఇది ఉంది. భారత్‌ లో ఉన్న దావూదీ బోహ్రా కమ్యూనిటీ ఈ మసీదు పునరుద్ధరణకు సహకరించింది. అల్-హకీమ్ మసీదు సందర్శన సందర్భంగా ప్రధాని మోడీ వెంట, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా కూడా ఉంటారని భావిస్తున్నారు. 2015లో అబుదాబిలోని షేక్ జాయెద్ గ్రాండ్ మసీదు, 2018లో ఇండోనేషియాలోని గ్రాండ్ ఇస్తిఖ్‌లాల్ మసీదులను కూడా మోడీ సందర్శించారు.

Also Read..

స్టేజ్‌పైనే కుప్పకూలి చనిపోయిన రాపర్ బిగ్ పోకి (వీడియో)

Advertisement

Next Story