పాక్ ప్రతీకార దాడి.. ఇరాన్ ఏం చేసిందో తెలుసా ?

by Hajipasha |   ( Updated:2024-01-18 17:30:59.0  )
పాక్ ప్రతీకార దాడి.. ఇరాన్ ఏం చేసిందో తెలుసా ?
X

దిశ, నేషనల్ బ్యూరో : పాకిస్తాన్, ఇరాన్ దేశాల మధ్య స్నేహసంబంధం పూర్తిగా దెబ్బతింది. తొలుత పాక్‌లోని బెలూచిస్తాన్ ప్రావిన్సులో ఉన్న ఉగ్రవాద స్థావరంపై ఇరాన్ ఆర్మీ మిస్సైల్స్, ఆత్మాహుతి డ్రోన్లతో ఎటాక్ చేసింది. ఇది జరిగిన 24 గంటల తర్వాత (గురువారం తెల్లవారుజామున) ఇరాన్‌లోని ఉగ్రవాద స్థావరంపైకి పాకిస్తాన్ క్షిపణులతో దాడికి పాల్పడింది. తొలుత పాక్‌పై ఇరాన్ దాడిచేసిన తర్వాత ఏదైతే జరిగిందో.. అచ్చం అదే సీన్ ఇప్పుడు రిపీట్ అయ్యింది. బుధవారం రోజు ఇరాన్ దౌత్యవేత్తను పిలిపించి పాక్ ప్రభుత్వం నిరసన తెలిపింది. తాజాగా గురువారం రోజు పాక్ దాడి చేయడంతో.. ఆ దేశానికి చెందిన అత్యంత సీనియర్ దౌత్యవేత్తను పిలిపించి ఇరాన్ మాట్లాడింది. ప్రతీకార క్షిపణి దాడిపై పాకిస్తాన్ వెంటనే వివరణ ఇవ్వాలని ఆదేశించింది. గురువారం తెల్లవారుజామున సిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని సరిహద్దు గ్రామంపై పాక్ చేసిన దాడిలో దాదాపు తొమ్మిది మంది చనిపోయారని వెల్లడించింది. ఈ పరిణామాల నేపథ్యంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ సదస్సు కోసం దావోస్‌లో జరుగుతున్న తన పర్యటనను పాక్ తాత్కాలిక ప్రధానమంత్రి అన్వరుల్ హక్ కాకర్ తగ్గించుకుంటారని పాకిస్థాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు.

Advertisement

Next Story