- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎన్ఆర్ఐల మద్దతు
దిశ, తెలంగాణ బ్యూరో : మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఎన్నారైలు మద్దతు పలికారు. బిల్లుకు మద్దతుగా ఆస్ట్రేలియాలో ముమ్మర ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఆస్ట్రేలియా మహిళా వింగ్ అధ్యక్షురాలు సంగీత ధూపాటి ఆధ్వర్యంలో ఆదివారం సిడ్నీలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులంతా మహిళా బిల్లుకు మద్దతు తెలపాలని కోరారు. భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా ఆస్ట్రేలియాలో ప్రచారం ప్రారంభించామన్నారు.
బతుకమ్మ పండుగతో తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాల విశిష్టతను ఖండాంతరాలకు వ్యాప్తిచెందేలా కృషి చేశారన్నారు. బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళలను ఐక్యం చేసి రిజర్వేషన్ బిల్లును కవిత సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గిరి రాపోలు, కన్వీనర్ రవిశంకర్ ధూపాటి , లివింగ్స్టున్ చెట్టిపల్లి, అమ్రీన్, గుల్షన్ ఆర, స్వప్న నెల్లీ, పరశురాం, అజాజ్, ఇస్మాయిల్, చిరాన్ పురంశెట్టి తదితరులు పాల్గొన్నారు.