- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Trump-Netanyahu: ట్రంప్‌తో ఫోన్ కాల్ వార్తలపై స్పష్టతనిచ్చిన నెతన్యాహు
దిశ, నేషనల్ బ్యూరో: డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్ కాల్ మాట్లాడినట్లు ఇటీవల మీడియాలో వార్తలు రాగా, దీనిపై తాజాగా నెతన్యాహు స్పందించారు. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో నెతన్యాహు మాట్లాడలేదని ఆయన కార్యాలయం నుండి ఒక ప్రకటన వెలువడింది. అయితే అంతకుముందు ఈ ఇద్దరు నేతలు గాజా కాల్పుల విరమణపై ఫోన్‌కాల్‌లో మాట్లాడుకున్నట్లు కథనాలు వచ్చాయి. ఈ కాల్లో గాజాలో కాల్పుల విరమణ, బందీలను విడుదల చేయడంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని, యుద్ధానికి ముగింపు పలకాలని నెతన్యాహును ట్రంప్ కోరినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ట్రంప్ ప్రచారం బృందం నుంచి కూడా ఎలాంటి ప్రకటన రాలేదు.
ఈ విషయంపై పలు మీడియాల్లో పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు దీనిని ఖండించారు. ఈ వార్తలపై ట్రంప్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ఇజ్రాయెల్‌పై ప్రపంచదేశాలు ఒత్తిడి తెస్తున్నాయి. అమెరికా అధ్యక్షడు బైడెన్ కూడా హమాస్-ఇజ్రాయెల్ రెండు కూడా తమ సమస్యల్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని తక్షణం కాల్పులను విరమించి రెండు వర్గాలు కూడా బందీలను విడుదల చేయడానికి ఒక ఒప్పందానికి రావాలని నెతన్యాహుపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో నెతన్యాహు- ట్రంప్ ఇద్దరు నేతలు కూడా ఫోన్ కాల్ మాట్లాడినట్లు వార్తలు రావడం గమనార్హం.