- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
'ప్రేమ' పేదోళ్ల వ్యవహారమన్న మిలియనీర్ నాలుగో పెళ్లి చేసుకోబోతున్నాడు!
దిశ, వెబ్‌డెస్క్ః 'ప్రేమకు ఎలాంటి వివక్ష ఉండదు. రాజు, పేద, చిన్నా, పెద్దా అనే తేడాలేవీ ప్రేమలో కనిపించవు..' ఇవన్నీ సాధారణంగా వినే మాటలే. అయితే, ప్రపంచ మిలియనీర్లలో ఒకరైన బ్రాండన్ వేడ్ మాత్రం ఆ మాటను ఒప్పుకునేవాడు కాదు. ప్రేమ అనేది పేదోళ్ల వ్యవహారం. అది వాళ్లు సృష్టించుకున్నది.డబ్బున్నోళ్లకి అంత టైమ్ ఉండదని అనేవాడు. అయితే, కథ అడ్డం తిరిగింది, 'ఎదుటోళ్లకి చెప్పడానికే నీతులుంటాయ్..' అన్న మాదిరి ఈ 51 ఏళ్ల మిలియనీర్ తన సొంత డేటింగ్ వెబ్‌సైట్ 'షుగర్ బేబీ'లో ఓ పోరిని ప్రేమించేశాడు. 'సీకింగ్ అరేంజ్‌మెంట్స్' వేదికలో దగ్గరైన తన 21 ఏళ్ల ప్రియురాలు డానా రోజ్‌వాల్‌ను త్వరలో వివాహం చేసుకోబోతున్నాడు. ప్రేమకు టైమ్ ఇవ్వలేని ఇతగాడికి ఇది నాలుగో పెళ్లి!
ఇక, ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకొన్న బ్రాండన్ మరోసారి ఇటీవలి భార్యతో విడాకులు తీసుకొని, మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. అంతేనా, 'డానాకు నాకూ మధ్య ఉన్న ప్రేమ శాశ్వతమైనది, ఇది జీవితానికి అతీతమైనది. ఈ వివాహం ఒక అమోఘమైన సంఘటన, దీనితో మేము ప్రపంచానికి సందేశం పంపాలనుకుంటున్నాము. ఇదేదో గాలిలో చెబుతున్న మాట కాదు. ఇది ఎంతో నిబద్ధతతో అంటున్న మాట" అని మీడియాకు చెప్పాడు. 2020లో డానాను కలవడానికి ముందు ప్రేమ నిజమైనదని తాను నమ్మలేదని అన్నాడు. జీవితంలో నేను ఏది కోల్పోయినా తన తోడులో ఎంతో సంతోషంగా ఉంటానంటూ.. డైలాగులు గుప్పించాడు. "మేమిద్దరం మొదట కలుసుకున్నప్పుడు వివాహం చేసుకోవాలని అనుకోలేదు, కాని చివరికి ప్రేమ అంటే ఏంటో అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాము" అంటూ ఎక్స్‌ట్రీమ్ ఎమోషన్‌ని చూపించాడు.
'షుగర్ బేబీ' సైట్‌లో దొరికిన బ్రాండన్ ప్రియురాలు డానా కూడా ఇరువురి ప్రేమపై స్పందించారు. "వయసు గ్యాప్ కారణంగానే తమవైపు విచిత్రంగా చూస్తున్నారనీ.. మా పైన ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకునే ముందు మాతో ఐదు నిమిషాలు గడపితే మీకే తెలుస్తుందనీ.. మా ప్రేమ నిజమైనది" అని డానా చెప్పింది. వీరిద్దరి ప్రేమకు గుర్తుగా ఇన్‌స్టాగ్రామ్‌లో డానాబ్రాండన్108 అనే పేజీని కూడా క్రియేట్ చేశారు.