- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Kim Jong Un : మాకు ఇతర దేశాల సహాయం అవసరం లేదు : కిమ్ జోంగ్ ఉన్

దిశ, వెబ్‌డెస్క్ : ఉత్తర కొరియా దేశాన్ని గత కొన్ని రోజులుగా వరదలు ముంచ్చెతుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వరదల నుంచి కోలుకోవడానికి మాకు ఇతర దేశాల అవసరం లేదని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సృష్టం చేశారు.ముఖ్యంగా ఉత్తర కొరియా ప్రాంతంలో ఈ వరద గుప్పిట్లో ఉన్న జనాన్నివరదల నుండి కాపాడటానికి బయటి దేశాల సహాయం కోరడం లేదని, వరద బాధితులకు మెరుగైన సంరక్షణ అందించడానికి రాజధాని ప్యోంగ్యాంగ్ కు తీసుకురావాలని కిమ్ జోంగ్ ఉన్ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.
కాగా.. ఉత్తరకొరియా నార్త్ వెస్ట్ నగరమైన ఉయిజులో వరద బాధితులను కలవడానికి, అక్కడి పరిస్థితులపై చర్చించడానికి రెండు రోజుల పర్యటనకు వచ్చిన సందర్భంగా కిమ్ ఈ వ్యాఖ్యలు చేశారని KCNA తెలిపింది. గత జూలై చివరి వారంలో కురిసిన భారీ వర్షాల కారణంగా నార్త్ వెస్ట్ నగరం సినుయిజు , పొరుగు పట్టణమైన ఉయిజులో దాదాపు 4,100 ఇళ్లు, 7,410 ఎకరాల పంట పొలాలు , ప్రజా భవనాలు, రోడ్లు మరియు రైల్వేలు జలమయమయ్యాయని రాష్ట్ర మీడియా ఓ ప్రకటనలో తెలిపింది . అయితే నార్త్ కొరియా మిత్రదేశాలు అయిన రష్యా, చైనా ఉత్తర కొరియాకు సహాయం అందించడానికి ముందుకొచ్చాయి, అయితే వాటి సహాయం మాకు అవసరంలేదని కిమ్ తెలిపినట్లు సమాచారం.