US President Elections: అమెరికా అధ్యక్ష రేసు నుంచి బైడెన్ ఔట్?

by Shamantha N |
US President Elections: అమెరికా అధ్యక్ష రేసు నుంచి బైడెన్ ఔట్?
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్‌ (US President) వైదొలగాలని అందరూ భావిస్తున్నారు. సొంత పార్టీ.. డెమొక్రాటిక్ పార్టీ(Democratic Party) నేతలే జో బైడెన్(Joe Biden) అధ్యక్ష బరిలోనుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తున్ననారు. కాగా.. ఈ విషయంపై ఈ వారాంతంలోగా నిర్ణయం వెలువడనున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా(Barack Obama), మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ(Nancy Pelosi) సహా డెమోక్రాటిక్ పార్టీ నేతలందరూ బైడెన్ అభ్యర్థిత్వంపై ఆందోళనలు వ్యక్తం చేశారు. దీంతో, బైడెన్ అభ్యర్థిత్వంపై సందేహాలు నెలకొన్నాయి. ఆయన వయసు, ఆయన ఆరోగ్య సమస్యలు, ఇతర కారణాలతో సొంత పార్టీలోనే ఆయనపై వ్యతిరేకత ఏర్పడినట్లు సమాచారం.

బైడెన్ ఆత్మపరిశోధన

బైడెన్ ఆత్మపరిశోధన చేసుకుంటున్నట్లు డెమొక్రాటిక్ పార్టీ వర్గాలు తెలిపాయి. పోటీ నుంచి వెనక్కి వెళ్లాలని అతను తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోందని స్థానిక మీడియా తెలిపింది. ‘‘ అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిచే అవకాశాలు లేవనే వాస్తవాన్ని బైడెన్‌ అంగీకరించడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని అధ్యక్షుడి సన్నిహితులు కూడా తెలిపారు. సొంత పార్టీ నుంచి డిమాండ్లు వస్తుండంటో బైడెన్ బరిలోనుంచి వైదొలిగే అవకాశం ఉంది’’ అని న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది.

బైడెన్ కు కరోనా

ఇటీవల కొవిడ్‌ బారిన పడిన బైడెన్‌ ప్రస్తుతం డెలావర్‌లోని తన ఇంట్లో క్వారెంటైన్‌లో ఉన్నారు. తాను తీవ్ర అనారోగ్యానికి గురైతే అధ్యక్ష రేసు నుంచి వైదొలగడంపై ఆలోచిస్తానని చెప్పిన కొన్ని గంటలకే ఆయనకు కరోనా సోకింది. అయితే, బైడెన్ స్వల్ప శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న డాక్టర్లు తెలిపారు. ఇకపోతే. అధ్యక్ష రేసుపై కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాతే అధికారిక ప్రకటన చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ను డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమె పోటీ కోసం సన్నద్ధమవుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా.. ఆమె, తన రన్నింగ్‌ మేట్ గా ఎవరని ఎంచుకుంటుందనే దానిపై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.


Advertisement

Next Story

Most Viewed