నీటిపై తేలియాడే ఎయిర్ పోర్ట్.. ఇక సముద్రం పాలేనా? (వీడియో)

by GSrikanth |
నీటిపై తేలియాడే ఎయిర్ పోర్ట్.. ఇక సముద్రం పాలేనా? (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్ని విపత్తులు వచ్చినా తట్టుకుని నిలబడటంలో మాకు మేమే సాటి అని ఎన్నో సందర్భాల్లో జపాన్ ప్రజలు చాటి చెప్పారు. సెకండ్ వరల్డ్ వార్‌లో అణుబాంబుల దాడి నుంచి వరుసగా దేశాన్ని వణికిస్తున్న వరుస భూకంపాల వరకు అన్ని విపత్తులను ఎదుర్కొంటూ నిలబడుతోంది జపాన్. అటువంటి జపాన్‌లో నిర్మించిన నీటిపై తేలియాడే ఎయిర్ పోర్ట్ క్రమంగా కుంగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆ దేశం నిర్మించిన అతిపెద్ద ఇంజనీరింగ్ అద్భుతం కన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి వార్తల్లో నిలిచింది. జపాన్ సముద్ర తీరానికి 4 కిలోమీటర్ల దూరంలో సముద్రంపై నిర్మించిన ఈ ఎయిర్ పోర్ట్ కుంగిపోతుండటం ప్రస్తుతం ఆందోళనకరంగా మారుతోంది. దేశ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జపాన్ దేశం ప్రపంచంలోనే మొట్టమొదటి నీటిపై తేలియాడే విమానాశ్రయాన్ని 20 బిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో 1987లో పనులు ప్రారంభించింది.

కాగా ఈ విమానాశ్రయం నిర్మాణం కోసం ప్రత్యేకంగా జపాన్ సముద్రంలో కృత్రిమ ద్వీపాన్ని నిర్మించింది. జపాన్ లోని గ్రేటర్ ఒసాకా ప్రాంతంలోని హూన్షు తీరానికి ఒసాకా బే మధ్యలో ఈ ఎయిర్ పోర్టు నిర్మించారు. ప్రతి సంవత్సరం ఈ ఎయిర్ పోర్ట్ ద్వారా 25 మిలియన్ల మంది ప్రయాణీకులు ప్రయాణిస్తున్నారు. విమానాశ్రయం దేశీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలకు ఉపయోగపడుతోంది. ఈ అద్భుత నిర్మాణం గురించి సోషల్ మీడియాలో ప్రశంసలు అందుతున్నప్పటికీ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ విమానాశ్రయం క్రమంగా సముద్రంలోకి కుంగిపోవడం చర్చనీయాంశం అవుతున్నది. 1994లో ప్రారంభమైన ఈ విమానాశ్రయం 2018 నాటికి స్మిత్సోనియన్ మ్యాగజైన్ ప్రకారం 38 అడుగుల మేర మునిగిపోయింది. అయితే నిర్మించే సమయంలోనే ఈ విమానాశ్రయం సముద్రంలో మునుగుతుందని ఇంజినీర్లు అంచనావేసినe వారి అంచనాల కంటే 25 శాతం ఎక్కువే నీటమునిగినట్లు ఈ మ్యాగజైన్ వెల్లడించింది. అయితే ఈ విమానాశ్రయం వెంటనే కాకపోయినా నెమ్మదిగానై మునిగిపోవడం ఖాయం అని చెబుతున్నారు.

Advertisement

Next Story