Ram Charan: డ్యూయల్ రోల్‌లో రామ్ చరణ్.. రీ-రిలీజ్‌కు రెడీ అయిన సూపర్ హిట్ సినిమా

by sudharani |
Ram Charan: డ్యూయల్ రోల్‌లో రామ్ చరణ్.. రీ-రిలీజ్‌కు రెడీ అయిన సూపర్ హిట్ సినిమా
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన చిత్రాల్లో ‘నాయక్’ (Nayak) ఒకటి. వి.వి. వినాయక్ (V.V. Vinayak) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal), అమలాపాల్ (Amalapal) హీరోయిన్లుగా నటించాను. రామ్ చరణ్ డ్యూయల్ రోల్‌లో నటించిన ఈ చిత్రం 2013లో విడుదలై హిట్ అందుకుంది. ఈ సినిమాలో బ్రహ్మానందం (Brahmanandam) (జిలేబి) క్యారెక్టర్ అందరిని కబుపుబ్బా నవ్వించాడు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ మూవీకి ఎస్.ఎస్. తమన్ (S.S. Thaman) సంగీతం అందించగా.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ (Interesting post) షేర్ చేశాడు. ‘మాస్ సినిమా ‘నాయక్’ రీరిలీజ్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను.. ఫైనల్‌గా హే.. నాయక్’ అనే క్యాప్షన్ ఇచ్చి ఓ పోస్టర్ షేర్ చేశాడు. ఇందులో.. రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్‌గా మార్చి 27న ‘నాయక్’ చిత్రం రీ రిలీజ్ (Re release) చేయబోతున్నట్లు ప్రకటించాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్టర్ వైరల్ కావడంతో.. చర్రీ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed