- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
James Cameron : టైటాన్ ప్రమాదానికి అదే కారణం..!
దిశ, వెబ్‌డెస్క్: సముద్రగర్భంలో తప్పిపోయిన జలాంతర్గామి టైటాన్ ముగినిపోయిన విషాదంపై జేమ్స్ కామెరూన్ స్పందించారు. టైటానిక్ నౌక శిథిలాలను చూపించేందుకు వెళ్లిన ఓసిగేట్ కంపెనీకి చెందిన సబ్ మెరైన్ టైటాన్ ఆదివారం (జూన్ 18) సముద్రంలో అదృశ్యమైంది. తప్పిపోయిన టైటాన్ జలాంతర్గామికి సంబంధించిన సెర్చ్ ఆపరేషన్ జరిపినప్పటికీ దాని ఆచూకీ కనిపించలేదు. ఈ దారుణ ఘటనలో ఐదుగురు బిలియనీర్లు ప్రాణాలు కోల్పోయినట్లు ఈ ట్రావెల్ సబ్‌మెరైన్‌ను నడుపుతున్న ఓసిగేట్ కంపెనీ తెలిపింది. ఈ ప్రమాదంపై హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సంతాపం వ్యక్తం చేశారు.
ఆయన మాట్లాడుతూ.. ఇది చాలా బాధకరమైన విషయం. ఈ సంఘటన ఎన్నాళ్లయినా మరచిపోలేని భయంకరమైన కల. సముద్ర గర్భంలో ప్రయాణించడం అనేది ఒక పరిపక్వతతో కూడిన కళ. భద్రతపరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాదం జరిగిన వెంటనే నాకు సమాచారం ఇచ్చారు. నాకు అందిన సమాచారం మేరకు ఒక గంటలో ఏం జరిగి ఉంటుందో నేను విశ్లేషించి చూశాను. టైటాన్‌తో సంబంధాలు తెగిపోయిన సుమారు గంట తర్వాత ఒక పెద్ద శబ్దం వినిపించింది. దాన్ని హైడ్రోఫోన్ ద్వారా విన్నాం. ఆ తర్వాత ట్రాన్స్‌పాండర్‌తో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. మినీ సబ్‌మెరైన్ పేలిపోయి ఉంటుందని గ్రహించా. ప్రమాదం జరిగిన సమయంలో వాళ్లు 3500 మీటర్ల లోతులో ఉన్నారు. ఆ తర్వాత కొద్ది సేపటికే 3800 మీటర్లు అంటే సముద్రం అడుగు భాగానికి వెళ్లిపోయి ఉంటారని అనుకున్నాం. దీంతో వాళ్లు బతికే అవకాశం ఉండదని భావించాం. కానీ.. టైటానిక్ ఘోరం జరిగిన చోటే ఈ ఘటన జరగడం నన్ను ఆశ్చర్యపరిచింది.
James Cameron : మునిగిపోయిన టైటానిక్ దగ్గరకు 33 సార్లు వెళ్లిన డైరెక్టర్