US Election: అధ్యక్షుడు ఎవరైనా.. పనిచేయడానికి భారత్ సిద్ధం: జైశంకర్

by Harish |   ( Updated:2024-08-13 15:12:20.0  )
US Election: అధ్యక్షుడు ఎవరైనా.. పనిచేయడానికి భారత్ సిద్ధం: జైశంకర్
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడి హోదాలో ఎవరు ఉన్నా, వారితో కలిసి పనిచేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం అన్నారు. ఒక మీడియా సమావేశంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా, మనం ఇతరుల ఎన్నికలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయం, ఎందుకంటే ఇతరులు కూడా మన అంతర్గత అంశాలపై మాట్లాడకూడదని కోరుకుంటాం. కానీ గత 20 సంవత్సరాలను పరిశీలించినట్లయితే అమెరికా అధ్యక్ష పదవిలో ఎవరు ఉన్న కూడా భారత్ వారితో కలిసి పని చేసింది, ఇప్పుడు కూడా అధ్యక్ష పదవికి ఎవరు ఎన్నికైన వారితో కలిసి పనిచేయడానికి భారత్ సిద్ధంగా ఉంటుందని జైశంకర్ స్పష్టం చేశారు.

ఇంకా ఇజ్రాయెల్, ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధాల గురించి మాట్లాడుతూ, మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితుల కారణంగా రాబోయే ఐదేళ్ల కాలం చాలా క్లిష్టతరమైనది, ప్రపంచంలో అనిశ్చితి పరిస్థితులు పెరిగిపోయాయి. యుద్ధాల కారణంగా అన్ని దేశాలు గణనీయమైన ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాయి, వాణిజ్యం కష్టంగా మారుతుంది, విదేశీ మారకద్రవ్య కొరత, అనేక ఇతర అంతరాయాలతో పోరాడుతున్నాయి. భారత్‌ కూడా దీని ప్రభావానికి లోనవుతుందని మంత్రి పేర్కొన్నారు. వాతావరణ పరిణామాలు కూడా ప్రపంచ అస్థిరతకు దోహదపడుతున్నాయి, దీనివల్ల తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని ఈ సందర్బంగా ఆయన అన్నారు.

Advertisement

Next Story

Most Viewed