- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Israel- Iran : ఇజ్రాయిల్ సంచలన నిర్ణయం.. ఆ దేశాలతో కూటమి..!
దిశ, వెబ్‌డెస్క్ : హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనీయే హత్య జరిగిన తరువాత ఇరాన్-ఇజ్రాయిల్ దేశాల మధ్య గత కొన్ని రోజులుగా భీకరమైన యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. హనీయే హత్యకు ఇజ్రాయిల్ దేశమే కారణమని ఇరాన్ ఆరోపిస్తోంది. అయితే హనీయే హత్యకు తాము తప్పక ప్రతీకారం తీర్చుకుంటామని, ఇజ్రాయిల్ దేశాన్ని వదిలిపెట్టేది లేదని ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది.కాగా ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఇజ్రాయిల్ దేశంపై ప్రతీకార దాడికి ఆదేశించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో.. ఇజ్రాయిల్ దేశ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇరాన్ చెయ్యబోయే దాడిని ఎదుర్కొనేందుకు అమెరికా, యూకే దేశాలతో కలిసి "అబ్రహం (ABRAHAM) " కూటమి ఏర్పాటు చెయ్యాలని ఇజ్రాయిల్ దేశ భద్రత అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.మరోవైపు ఇరాన్ తమ దేశంపై దాడి చేస్తే అమెరికా,బ్రిటన్ ఇజ్రాయిల్ కి అండగా నిలబడుతాయని ఆ దేశ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ ఓ ప్రకటనలో తెలిపారు.కాగా ఇప్పటికే అమెరికా ఇజ్రాయిల్ దేశానికి యుద్ధనౌకలతో పాటు పలు రక్షణ సామాగ్రిని పంపింది. దీంతో ఒక్కసారిగా మధ్యప్రాచ్య దేశాలలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి.