Israel Hamas war ఇజ్రాయెల్‌పై దాడికి ఇరాన్, హిజ్బొల్లా సిద్ధం..పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత!

by vinod kumar |
Israel Hamas war ఇజ్రాయెల్‌పై దాడికి ఇరాన్, హిజ్బొల్లా సిద్ధం..పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత!
X

దిశ, నేషనల్ బ్యూరో: హమాస్ చీఫ్ హనియా హత్యతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హనియా మరణానంతరం ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడి చేయాలని హెచ్చరించడం, ఇరాన్ మద్దతు దాడులైన సంస్థలు హిజ్బొల్లా, హౌతీలు సైతం ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చాయి. ఈ సంస్థలు ఏ క్షణమైనా ఇజ్రాయెల్‌పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) తమ బలగాలను అప్రమత్తం చేసింది. ఎటువంటి దాడులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆందోళలనతో అనేక అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఇజ్రాయెల్‌కు విమానాలను నిలిపివేశాయి.

ఇజ్రాయెల్‌ను రక్షిస్తాం: అమెరికా

ఉద్రిక్తతలు పెరగడంతో అమెరికా సైతం ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించింది. మధ్యప్రాచ్యంలో మరిన్ని ఆయుధాలను మోహరించాలని నిర్ణయించింది. ఆ ప్రాంతంలో భారీగా యుద్ధ నౌకలు, ఫైటర్‌ జెట్లు, బాలిస్టిక్‌ క్షిపణి సామర్థ్యం కలిగిన అదనపు క్రూజర్లు, డిస్ట్రాయర్లను మోహరించనున్నట్టు అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ తెలిపింది. ఇజ్రాయెల్‌ను రక్షించడమే తమ లక్ష్యమని పేర్కొంది. ఈ ప్రతిపాదనకు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఆమోదం తెలిపారు. ఇప్పటికే వీటిని పంపించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్‌లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, తీవ్ర ఉద్రిక్తతల మధ్య ప్రోటోకాల్‌లకు కట్టుబడి ఉండాలని ఇండియన్ ఎంబసీ ఆదేశాలు జారీ చేసింది.

వెస్ట్ బ్యాంకుపై దాడి: హమాస్ కమాండర్ హతం

తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నా, తమపై దాడి చేస్తామని హెచ్చరించినా ఇజ్రాయెల్ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఇప్పటికే గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ తాజాగా గాజాలోని ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌పై వైమాణిక దాడి చేసింది. ఈ ఘటనలో హమాస్ కమాండర్ సహా ఐదుగురు మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇజ్రాయెల్ సైన్యం తుల్కర్మ్‌లోని టెర్రర్ సెల్‌ను లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. మిలిటెంట్లు వెళ్తున్న ఓ వాహనంపై దాడికి పాల్పడినట్టు స్థానిక కథనాలు వెల్లడించాయి.

Advertisement

Next Story

Most Viewed