- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గాజాలోని పాలస్తీన శిబిరంపై ఇజ్రాయెల్ భారీ దాడి.. 50 మంది మృతి
దిశ, వెబ్‌డెస్క్: ఇజ్రాయెల్, హమాస్ ల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా మంగళవారం.. పాలస్తీనా భూభాగంలోని శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ భారీ బాంబు దాడి చేసింది. ఈ దాడిలో కనీసం 50 మంది మరణించినట్లు హమాస్ ఆధ్వర్యంలోని గాజా స్ట్రిప్‌లోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. "ఉత్తర (గాజా) స్ట్రిప్‌లోని జబాలియా క్యాంప్‌లోని పెద్ద ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్ దారుణమైన మారణకాండలో 150 మందికి పైగా గాయపడ్డారు.
అలాగే పదుల సంఖ్యలో శిథిలాల కింద చిక్కుకున్నారని అక్కడి అధికారులు తెలిపారు. అక్టోబరు 7న ఇజ్రాయెల్ బాంబు దాడులను ప్రారంభించినప్పటి నుంచి గాజాలో 8,525 మంది మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గాజాకు చెందిన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ కమ్యూనిటీలు, ఆర్మీ పోస్టుల పై దాడులు చేయడంతో దాదాపు 1,400 మంది మరణించారని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు.