- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇజ్రాయెల్‌తో గూఢచర్యం ఆరోపణలు: నలుగురిని ఉరితీసిన ఇరాన్
దిశ, నేషనల్ బ్యూరో: గూఢచర్యానికి పాల్పడిన కేసులో నలుగురు నిందితులకు ఇరాన్ ప్రభుత్వం సోమవారం ఉరిశిక్ష అమలు చేసింది. వీరికి ఇజ్రాయెల్ ఇంజలిజెన్స్ అయిన ‘మొస్సాద్’తో సంబంధం ఉందని ఇరాన్ అధికారులు వెల్లడించారు. మొహమ్మద్ ఫరామర్జీ, మొహసేన్ మజ్లూమ్, వఫా అజర్బర్, పెజ్మాన్ ఫతేహి అనే నలుగురు వ్యక్తులు ఇరాక్‌లోని కుర్దిస్థాన్ ప్రాంతం నుంచి ఇరాన్ భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించి సెంట్రల్ ప్రావిన్స్ ఇస్ఫాహాన్‌లోని రక్షణ మంత్రిత్వ శాఖ కేంద్రంపై బాంబు దాడి చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలున్నాయి. దీంతో వారిని 2022 జూలైలో అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే నేరం రుజువు కావడంతో 2023 సెప్టెంబర్‌లో న్యాయస్థానం నిందితులకు ఉరిశిక్ష విధించగా..తాజాగా అమలు చేశారు. కాగా, ఇరాన్, ఇజ్రాయెల్ దీర్ఘకాల శత్రువులు. ఇరాన్ తమకు వ్యతిరేకంగా తీవ్రవాద దాడులకు మద్దతు ఇస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ప్రస్తుతం ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలోనూ ఇరాన్ హమాస్‌కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే