US Election: దేవుడి ఆశీసులవల్లే ఇలా ఉన్నా- డొనాల్డ్ ట్రంప్

by Shamantha N |
US Election: దేవుడి ఆశీసులవల్లే ఇలా ఉన్నా- డొనాల్డ్ ట్రంప్
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా ప్రజలు తనకు మద్దతుగా నిలిచినందుకు రిపబ్లిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ధన్యవాదాలు తెలిపారు. మిల్వాకీలో జరిగిన రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ మూడో రోజున ఆయన ప్రసంగించారు. తనపై జరిగిన హత్యాయత్నం గురించి వివరించారు. దేవుడి ఆశీస్సుల వల్లే ఈరోజు మీముందు నిలబడగలిగానని ట్రంప్‌ అన్నారు. ఏమాత్రం పొరపాటు జరిగినా తాను ఇలా అందరిముందు నిలబడి ఉండేవాడిని కాదని పేర్కొన్నారు. ఈసందర్భంగా తనపై జరిగిన కాల్పుల ఘటనను ట్రంప్‌ గుర్తు చేసుకున్నారు. ఇమిగ్రేషన్ చార్ట్ కోసం తల తిప్పానని .. అలా జరగకుంటే బుల్లెట్ తనపై దూసుకువచ్చేదని అన్నారు. తాను అదృష్టవంతుడనని పేర్కొన్నారు. దేవుడు తనవైపు ఉన్నాడని.. ఆయన ఆశీస్సులే కాపాడాయన్నారు. ఆ క్షణంలో దేవుడే తన మరణాన్ని అడ్డుకున్నాడని ఎమోషనల్ అయ్యారు. ఇకపోతే, పెన్సిల్వేనియాలో తనపై హత్యాయత్నం జరిగిన తర్వాత ట్రంప్ తొలిసారిగా ప్రసంగించారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ఉండేందుకు మీ నామినేషన్‌ను అంగీకరిస్తున్నానని చెబుతూ పార్టీ సభ్యులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed