Greta Thunberg: ఇజ్రాయిల్ దాడికి వ్యతిరేకంగా నిరసన..పర్యావరణవేత్త గ్రేటా థాన్‌బర్గ్‌ అరెస్ట్..!

by Maddikunta Saikiran |
Greta Thunberg: ఇజ్రాయిల్ దాడికి వ్యతిరేకంగా నిరసన..పర్యావరణవేత్త గ్రేటా థాన్‌బర్గ్‌ అరెస్ట్..!
X

దిశ, వెబ్‌డెస్క్:గాజా(Gaza)పై ఇజ్రాయిల్ (Israel) దాడికి వ్యతిరేకంగా డెన్మార్క్‌(Denmark)లో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పర్యావరణవేత్త 21 ఏళ్ల 'గ్రేటా థాన్‌బర్గ్‌'(Greta Thunberg)ను పోలీసులు అరెస్టు చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.డెన్మార్క్‌లోని యూనివర్శిటీ ఆఫ్ కోపెన్‌హాగన్‌ (University of Copenhagen)లో జరిగిన నిరసనలో ఆమె అరెస్టయ్యింది.ఈ విషయాన్ని విద్యార్థి సంఘం ప్రతినిధి ఒకరు మీడియాతో తెలిపారు.వివరాల్లోకి వెళ్తే.. పాలస్తీనా(Palestine)పై ఇజ్రాయిల్ దాడికి వ్యతిరేకంగా 'స్టూడెంట్స్ అగైనెస్ట్ ది ఆక్యుపేషన్' అనే విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాలను దిగ్బంధించారు. ఇజ్రాయెల్ యూనివర్సిటీలను బహిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.పాలస్తీనాపై దాడులు కొనసాగుతున్న సమయంలో కోపెన్‌హాగన్ విశ్వవిద్యాలయం ఇజ్రాయిల్ విశ్వవిద్యాలయాలతో సహకరించడం నిలిపివేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. కాగా ఈ నిరసనల్లో గ్రేటా థాన్‌బర్గ్‌ కూడా పాల్గొంది.

కాగా, గ్రేటా అరెస్ట్‌పై పోలీసులు స్పందించలేదు. యూనివర్శిటీ ఆఫ్ కోపెన్‌హాగన్‌లో జరిగిన నిరసనల్లో కేవలం ఆరుగురిని మాత్రమే అరెస్టు చేసినట్లు పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు. క్యాంపస్ ప్రవేశ ద్వారం దిగ్బంధించేలా చర్యలు తీసుకున్నామని,అరెస్టయిన వారి వివరాలను వెల్లడించలేమని పోలీసులు చెప్పారు. అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో గ్రేటా కూడా ఉన్నట్లు 'స్టూడెంట్స్ అగైనెస్ట్ ది ఆక్యుపేషన్' విద్యార్థి సంఘం ప్రతినిధి ఒకరు ప్రముఖ పత్రికతో తెలిపారు. గ్రేటా థన్‌బర్గ్ తన భుజాల చుట్టూ నలుపు-తెలుపు కెఫియా శాలువాను ధరించి క్యాంపస్ నుండి పోలిసులు ఆమెని బయటికి తీసుకువస్తున్న ఫోటో ఒకటి ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. దీంతో గ్రేటాను పోలీసులు అరెస్టు చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story