కేరళలో మరోసారి నిఫా కలకలం

by M.Rajitha |   ( Updated:2024-09-16 11:14:08.0  )
కేరళలో మరోసారి నిఫా కలకలం
X

దిశ, వెబ్ డెస్క్ : కేరళ(Kerala)లో మరోసారి నిఫా వైరస్ (Nipah virus) కలకలం సృష్టిస్తోంది. మలప్పురం జిల్లాలో సోమవారం ఓ వ్యక్తి నిఫా వైరస్ తో మృతి చెందాడు. దీంతో అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. మలప్పురం జిల్లా అంతటా మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో నిఫా ప్రొటోకాల్ నిబంధనలు అమల్లోకి తీసుకు వచ్చింది. జిల్లాలోని పేరింతల్ మన్న టౌన్ లో ఓ యువకుడు నిఫా లక్షణాలతో గత సోమవారం మృతి చెందగా.. అతని నమూనాలు పూణెలోని వైరాలజీ(Virology) ల్యాబ్ కు పంపించారు. అది నిఫా పాజిటివ్ గా తేలడంతో.. ఆ వ్యక్తితో గతకొన్ని రోజులుగా సన్నిహితంగా మెలిగిన వారి గురించి కేరళ వైద్యారోగ్య శాఖ ఎంక్వైరీ జరిపించింది. ఏకంగా 157 మందితో మృతుడు సన్నిహితంగా మెలిగినట్టు అధికారులు అంచనాకు వచ్చారు. తక్షణమే స్పందించిన ప్రభుత్వం.. మలప్పురం జిల్లాల్లోని పలు పంచాయితీల్లో నిఫా లాక్ డౌన్ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో విద్యాసంస్థలు, థియేటర్లు, పార్కులు, పబ్లిక్ ప్రాంతాలన్నీ మూసివేశారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed