- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇజ్రాయెల్ దాడుల్లో గాజా అప్రకటిత ప్రధాని మృతి
దిశ, వెబ్ డెస్క్ : గాజా పట్టీలో హమాస్ అప్రకటిత ప్రధానిగా వ్యవహరించిన రావీ ముష్తాహా మృతి చెందినట్లు ఇజ్రాయెల్ భద్రతా(ఐడీఎఫ్) దళాలు ప్రకటించాయి. కొన్ని నెలల క్రితమే తాము జరిపిన దాడుల్లో అతడు చనిపోయినట్లు ఐడీఎఫ్, షిన్ బెట్ దళాలు తాజాగా ప్రకటించాయి. మరోవైపు హమాస్ మాత్రం వీరి మరణాలను ఇప్పటి వరకు ధ్రువీకరించలేదు. దీంతో ఆ మిలిటెంట్ సంస్థ కేడర్ నైతిక స్థైర్యం దెబ్బతినకుండా నష్టాలను దాస్తోందని ఇజ్రాయెల్ విశ్లేషిస్తుంది. ముష్తాహాను లక్ష్యంగా చేసుకొని ఐడీఎఫ్ దళాలు మూడు నెలల క్రితం గాజా పట్టీలో దాడి చేశాయని, ఆ సమయంలో అతడితోపాటు హమాస్ పొలిటికల్ బ్యూరో సీనియర్ నాయకుడు సమీ అల్ సిరాజ్, జనరల్ సెక్యూరిటీ చీఫ్ సమి ఒదేహ్ ఉన్నారని ఐడీఎఫ్ పేర్కొంది. ఆ దాడిలో వారు ముగ్గురు చనిపోయినట్లు తాజాగా ఐడీఎఫ్ ప్రకటించింది. వీరంతా సొరంగాల్లో నక్కిన సమయంలో ఇజ్రాయెల్ దళాలకు కచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారం అందడంతో ఫైటర్ జెట్ల సాయంతో దాడులు నిర్వహించి మట్టుబెట్టినట్లుగా వెల్లడించింది.