- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇజ్రాయెల్ నెక్స్ట్ టార్గెట్ దక్షిణ గాజా.. 4 లక్షల మందికి వార్నింగ్
గాజా: ఉత్తర గాజాపై పట్టు సాధించిన ఇజ్రాయెల్ ఆర్మీ.. ఇక దక్షిణ గాజాపైకి ఫోకస్‌ను మరల్చింది. ఈ ప్రాంతంలోని పాలస్తీనీయులు తక్షణమే పశ్చిమ గాజాకు వెళ్లిపోవాలని తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు కరపత్రాలను ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దక్షిణ గాజాలో జారవిడిచాయి. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరంలో దాదాపు 4లక్షల జనాభా ఉంది. ఇప్పుడు వీరంతా సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
శనివారం ఉదయం ఖాన్ యూనిస్‌లోని ఎలిమెంటరీ స్కూల్‌పైకి ఇజ్రాయెల్ ఆర్మీ రాకెట్లు, గ్రనేడ్లు ప్రయోగించింది. ఈ ఘటనలో 26 మంది మరణించగా, వారిలో అత్యధికులు చిన్నారులే ఉన్నారు. ఇజ్రాయెల్ ఆర్మీ భూతల దాడులతో ఉత్తర గాజాలో ఆరోగ్య సంక్షోభం నెలకొంది. విద్యుత్, ఇంధన కొరతతో ఆస్పత్రుల్లో వైద్య సేవలు స్తంభించాయి. చాలా ఆస్పత్రులు ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో నేలమట్టమయ్యాయి.
ఈతరుణంలో తాజాగా శనివారం మధ్యాహ్నం అల్ షిఫా హాస్పిటల్‌ను గంటలోగా ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ ఆర్మీ వార్నింగ్ ఇచ్చిందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో హుటాహుటిన దాదాపు 450 మంది రోగులు ఆ ఆస్పత్రి నుంచి వెళ్లిపోయారు. చాలామంది రోగులను వీల్‌చైర్లు, రోలింగ్ బెడ్‌లపైనే ఇళ్లకు తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ తమ గాయపడిన పిల్లలను, తల్లిదండ్రులను తీసుకెళ్లారు. కదలలేని స్థితిలో మరో 120 మంది రోగులు ఆస్పత్రిలోనే ఉండిపోయారు. వారికి సహాయం చేయడానికి ఆస్పత్రి డైరెక్టర్, నలుగురు వైద్యులు, నర్సుల టీమ్ ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నారు.
ఐక్యరాజ్యసమితి ప్రతినిధి బృందం ఇచ్చిన హామీ మేరకు వారు ఆస్పత్రిలోనే ఉన్నట్లు తెలిసింది. రోగులంతా ఆస్పత్రి నుంచి వెళ్లిపోయాక ఇజ్రాయెల్ ఆర్మీ పూర్తి విరుద్ధమైన మరో ప్రకటన విడుదల చేసింది. అల్-షిఫా ఆసుపత్రిని ఖాళీ చేయమని తాము రోగులు, వైద్య సిబ్బందిని ఆదేశించలేదని స్పష్టం చేసింది.