- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కడికి తొలిసారి ఇంటర్నెట్ రాక.. అశ్లీల వీడియోలకు బానిసలుగా మారుతున్న గిరిజనులు
దిశ, డైనమిక్ బ్యూరో:ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు రోజు రోజుకు మానవ జీవన శైలిని మార్చి వేస్తున్నది. దీంతో ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఊహించడం చాలా కష్టంగా మారిపోయింది. ప్రపంచం ఇంత అడ్వాన్స్డ్ గా ఉన్నప్పటికీ ఇప్పటికీ కొన్ని దట్టమైన అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆయా గిరిజన తెగలకు బయటి ప్రపంచం గురించి తెలియదంటే అతిశయోక్తి కాదు. అయితే ఇటీవలే ఇంటర్నెట్ పరిచయం అయిన ఓ గిరిజన తెగ యువకులు పోర్న్ కు బానిసలుగా మారడం ఆ తెగ పెద్దలను తలలు బాదుకునేలా చేస్తోంది. ఆ వ్యసనం బారి నుంచి తమ పిల్లలను ఎలా కాపాడుకోవాలో అని అక్కడి పెద్దలు తీవ్రంగా మదనపడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. బ్రెజిల్ లోని దట్టమైన అమెజాన్ అడవుల్లో కొన్ని వందల సంవత్సరాల పురాతనమైన మారుబోస్ అనే గిరిజన తెగ జీవిస్తోంది. ఈ తెగ బాహ్య ప్రపంచానికి దూరంగా తమ ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగిస్తూ జీవనం సాగిస్తోంది. అయితే గతేడాది సెప్టెంబర్ లో తొలిసారి అక్కడ ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
దీంతో క్రమంగా అక్కడి ప్రజల జీవన శైలిలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చాలా మంది యువకులు ఫోన్లకు బానిసలుగా మారిపోయారని అశ్లీల వీడియోలు విరివిగా షేర్ చేయడంతో పాటు బద్దకంగా మారిపోయారని తెగకు చెందిన పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తెగలో బహిరంగంగా స్రీ పురుషులు ముద్దులు పెట్టుకోవడం తప్పుగా భావించే పరిస్థితులు ఉంటే ఇప్పుడు పోర్న్ కంటెంట్ కు బానిసలుగా మారిపోతున్నట్లు ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. ఇంటర్నెట్ వచ్చిన ఆరంభంలో అందరూ సంతోషంగా ఉన్నామని, సుదూర ప్రంతాల్లో ఉన్న తమ ప్రియమైన వారితో వీడియో కాల్స్, చాటింగ్ లో సంతోషంగా ఉన్నామని అక్కడి పెద్దలు చెబుతున్నారు. పాముకాటుకు గురైన సందర్భాల్లో తక్షణం వైద్యసాయం పొందేలా అధికారులకు సమాచారం చేరవేసేందుకు ఈ ఇంటర్నెంట్ సేవలు ఉపయోగపడ్డాయని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చాయని అయితే క్రమంగా తెగకు చెందిన యువతలో వస్తున్న మార్పులు ఆందోళన కలిగిస్తున్నాయంటున్నారు. ముఖ్యంగా కొంతమంది యువకులలో మరింత దూకుడుగా లైంగిక ప్రవర్తనను గమనించామని చెబుతున్నారు. దీంతో ఇప్పటికే ఇంటర్నెట్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో దట్టమైన అడవుల్లో తమ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవడమే లక్ష్యంతో జీవనం సాగిస్తున్న ఈ గిరిజన తెగల్లో ఇంకెన్ని మార్పులు వస్తాయో చూడాలి.