Ethiopia Horror: ఇథియోపియాలో దారుణం..కొండ చరియలు విరిగిపడి157 మంది మృతి

by vinod kumar |
Ethiopia Horror: ఇథియోపియాలో దారుణం..కొండ చరియలు విరిగిపడి157 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆఫ్రికా దేశమైన ఇథియోపియాలో దారుణం చోటు చేసుకుంది. భారీ వర్షాల వల్ల ఆ దేశంలోని ఓ మూరుమూల గ్రామంలో కొండచరియలు విరిగిపడి157 మంది మృతి చెందారు. ఇందులో పిల్లలు గర్భిణులు, వృద్ధులు కూడా ఉన్నారు. దక్షిణ ఇథియోపియాలోని కెంచో షాచా గోజ్డి జిల్లాలోని గోఫాలో సోమవాకరం ఉదయం ఈ విషాద ఘటన జరిగింది. మృతులంతా బురదలో ఇరుక్కుని ఊపిరాడక మరణించినట్టు స్థానిక అధికారి దగ్మావి అయేలే తెలిపారు. ఈ ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని మంగళవారం వరకు 157 మంది మరణించినట్టు వెల్లడించారు. మరో అధికారి.. మార్కోస్ మెలేస్ మాట్లాడుతూ..బురదలో ఇరుక్కున్న వారిని కాపాడటానికి ప్రయత్నిస్తున్నామని 96 మంది పురుషులు, 50 మంది మహిళల మృతదేహాలు లభ్యమయ్యాయని సోదాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కొన్ని కుటుంబాలు పూర్తిగా మరణించినట్టు పేర్కొన్నారు. కాగా, ఇథియోపియా వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడటం సర్వసాధారణం కావడం గమనార్హం.

Next Story