- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నన్ను చంపుతామని వార్నింగ్స్ ఇచ్చారు : ఎలాన్ మస్క్
దిశ, నేషనల్ బ్యూరో : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో ట్విట్టర్ యజమాని, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ స్పందించారు. చంపేస్తామంటూ తనకు గతంలో వచ్చిన వార్నింగ్‌లను ఆయన గుర్తు చేసుకున్నారు. గత ఎనిమిది నెలల్లో తనకు రెండుసార్లు బెదిరింపులు వచ్చాయని, బెదిరించిన వారిని టెస్లా ప్రధాన కార్యాలయమున్న టెక్సాస్ నగరంలో అరెస్టు చేశారని మస్క్ వెల్లడించారు. ‘‘చేతుల్లో తుపాకులు పట్టుకొని మా ఆఫీసు వైపుగా వస్తున్న ఆగంతకులను పోలీసులు అరెస్టు చేశారు. టెస్లా ఆఫీసుకు కేవలం 20 నిమిషాల దూరంలో దుండగులు చిక్కారు’’ అని పేర్కొన్నారు.
ఉక్రెయిన్‌కు ఇంటర్నెట్ సర్వీసులు అందిస్తున్నందుకు రష్యాకు చెందిన కొందరు ఉన్నతాధికారులు తనను ఓసారి బెదిరించారని ఆయన తెలిపారు. ‘‘ఒకవేళ నేను అనుమానాస్పద స్థితిలో మరణిస్తే మీరు దాన్ని ఎలా కనిపెడతారో అనేది కూడా ఆసక్తికరంగా ఉంటుంది’’ అంటూ ఎలాన్ మస్క్ సరదాగా వ్యాఖ్యానించారు. ట్రంప్‌పై కాల్పుల నేపథ్యంలో అపర కుబేరుడు ఎలాన్ మస్క్ భద్రతపై ఓ నెటిజన్ ఆందోళన వ్యక్తం చేస్తూ ట్విట్టర్ (ఎక్స్)లో ఓ పోస్ట్ పెట్టాడు. ‘‘మీ భద్రతను మూడు రెట్లు పెంచుకోండి. దుండగులు ట్రంప్ దగ్గరకు వెళ్లగలిగారంటే మీ దగ్గరకు కూడా వస్తారు’’ అని మస్క్‌కు ఉచిత సలహా సైతం ఇచ్చాడు. ఎక్స్ వేదికా దీనికి బదులిస్తూ ఎలాన్ మస్క్ పై కామెంట్స్ చేశారు.