US elections: కమలా హ్యారిస్ తో మరోసారి చర్చలో పాల్గొనేందుకు సిద్ధంగా లేను- ట్రంప్

by Shamantha N |
US elections: కమలా హ్యారిస్ తో మరోసారి చర్చలో పాల్గొనేందుకు సిద్ధంగా లేను- ట్రంప్
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్(Kamala Harris) తో మరోసారి చర్చలో పాల్గొనబోనని మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో(US elections) భాగంగా ట్రంప్‌, కమలా హ్యారిస్‌ మధ్య బిగ్ డిబేట్ జరిగింది. పెన్సిల్వేనియాలోని నేషనల్‌ కాన్‌స్టిట్యూషన్ సెంటర్ వేదికగా వారిద్దరూ చర్చల్లో పాల్గొన్నారు. కాగా.. ఇప్పటికే పలు సర్వేలు కమలా హ్యారిస్ డిబేట్ లో గెలుపొందినట్లు చెబుతున్నాయి. కాగా.. ఈ నేపథ్యంలోనే కమలాతో మరోసారి చర్చకు సిద్ధంగా లేనని ట్రంప్ వెల్లడించారు. మంగళవారం రాత్రి డెమోక్రాట్ల రాడికల్‌ లెఫ్ట్‌ అభ్యర్థి కమలా హ్యారిస్ తో జరిగిన డిబేట్‌లో తానే గెలిచానని తెలిపారు. కానీ, సర్వేలు మాత్రం భిన్నంగా చూపిస్తున్నాయని ట్రంప్‌ విమర్శించారు. లూజర్ అయిన హారిస్‌తో మరోసారి చర్చకు తాను సిద్ధంగా లేనని ట్రంప్‌ పేర్కొన్నారు. ‘నేను మూడో చర్చకు సిద్ధంగా లేను’ అని ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

కమలానే గెలుపొందినట్లు సర్వేలు

ఇకపోతే, అధ్యక్ష రేసులోంచి బైడెన్‌ వైదొలగకముందు ట్రంప్‌, బైడెన్‌ల మధ్య తొలి డిబేట్‌ జరిగింది. ఇటీవలే ట్రంప్‌, కమాలల మధ్య రెండో డిబేట్‌ జరిగింది. దీంతో ఆయన మూడో డిబేట్‌కు సిద్ధంగా లేనని ప్రకటించారు. అయితే, ట్రంప్, కమలా మధ్య జరిగిన డిబేట్‌లో డెమోక్రటిక్‌ అభ్యర్థి కమలా హ్యారిస్ గెలుపొందినట్లు సర్వేలు చెబుతున్నాయి. సీఎన్ఎన్ విడుదల చేసిన సర్వేలో 63 శాతం మంది కమలాకు మద్దతివ్వగా, 37 శాతం మంది ట్రంప్ ని సపోర్ట్ చేశారు. యూ జీవోవీ సర్వే ప్రకారం 43 శాతం మంది హ్యారిస్ గెలుపొందినట్లు భావించగా.. 28 శాతం మంది ట్రంప్ కి అనుకూలంగా ఉన్నారు. మరో, 30 శాతం మంది ఏ నిర్ణయాన్ని తీసుకోలేకపోయారు. డిబేట్ జరిగిన 24 గంటల్లోనే హారిస్‌కు 47 మిలియన్ల (దాదాపు రూ.394కోట్లు) విరాళాలు సమకూరినట్లు తెలుస్తోంది. అక్టోబరు 1న న్యూయార్క్‌లో ట్రంప్‌ రన్నింగ్‌ మేట్‌ జేడీ వాన్స్‌, డెమోక్రటిక్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ టీమ్‌ వాజ్‌ల మధ్య చర్చ జరగనుంది.

Advertisement

Next Story