- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆఫ్ఘాన్‌లో కూలిన విమానం భారత్‌ది కాదు: డీజీసీఏ
దిశ, డైనమిక్ బ్యూరో: ఆఫ్గానిస్థాన్‌లోని బదాక్షన్ ప్రావిన్స్ తోప్‌ఖానా పర్వతాల్లో భారత్ విమానం కూలినట్లు తాజాగా ఆఫ్గాన్ వార్త సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలోనే అది భారత్ విమానం కాదని, మొరాకో రిజిస్టర్ ఎయిర్ క్రాప్ట్ కూలినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారి (డీజీసీఏ) ధృవీకరించారు. అయితే మరోవైపు రష్యా విమానం అదృశ్యమైనట్లు రష్యా ఏవియేషన్ విభాగం ఇవాళ వెల్లడించింది. నిన్న సాయంత్రం నుంచి విమానం రాడార్‌కు అందుబాటులోకి రాలేదని రష్యా తెలిపింది.
ఆఫ్గానిస్తాన్ మీదుగా వెళ్తుండగా రాడార్‌కు అందుబాటులోకి రాలేదని పేర్కొంది. అయితే ఈ రష్యా రిజిస్టర్ విమానంలో ఆరుగురు ఉన్నట్లు రష్యా వెల్లడించింది. భారత్, ఉబ్జెకిస్తాన్ మీదుగా ఆ చిన్న విమానం మాస్కో రావాల్సి ఉన్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే అఫ్గానిస్థాన్‌లో కూలిన విమానం రష్యాదని అనుమానిస్తున్నారు. దీంతో కూలిన విమానం పై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. కాగా, అఫ్గానిస్థాన్‌లో అక్కడి అధికారులు ప్రమాద స్థలానికి చేరుకోని దర్యాప్తు చేపట్టారు.