ఎన్టీఆర్ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. షెడ్యూల్ ఇదే!

by Jakkula Mamatha |
ఎన్టీఆర్ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. షెడ్యూల్ ఇదే!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh) సీఎం చంద్రబాబు(CM chandrababu) ఇవాళ(శనివారం) ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలంలో పర్యటించనున్నారు. నేడు(ఏప్రిల్ 5) బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా.. ముప్పాళ్లలో ఏర్పాటు చేస్తున్న ప్రజా వేదిక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ క్రమంలో అక్కడి ప్రజలతో మాట్లాడి.. వారి సమస్యలు తెలుసుకోనున్నారు. ఈ మేరకు ఈ రోజు ఉదయం 10:15 గంటలకు ఉండవల్లి(Vundavalli)లోని సీఎం నివాసం నుంచి పత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి 11:30 గంటలకు చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామానికి చేరుకుంటారు. ఈ తరుణంలో ముప్పాళ్ల గ్రామంలోని డా.బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు చేరుకుంటారు.

ఈ క్రమంలో అక్కడ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌(Laptop)లు పంపిణీ చేస్తారు. అనంతరం 11:46 గంటలకు నిమ్మతోటలో ఏర్పాటు చేసిన ప్రజా వేదిక కార్యక్రమానికి హాజరవుతారు. మధ్యాహ్నం 2:15 గంటలకు ముప్పాళ్లలోని వేబ్రిడ్జి స్థలం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం 3:40 గంటలకు తిరుగు ప్రయాణం అవుతారు. సాయంత్రం 4:05 గంటలకు సీఎం చంద్రబాబు(CM Chandrababu) నివాసానికి చేరుకుంటారు.

Next Story

Most Viewed