పాక్ సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ప్రధాని.. రీఎంట్రీకి లైన్ క్లియర్..

by Vinod kumar |
పాక్ సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ప్రధాని.. రీఎంట్రీకి లైన్ క్లియర్..
X

ఇస్లామాబాద్ : ఈ ఏడాది చివర్లో జరగబోయే పాక్ సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌(73) పోటీ చేసేందుకు లైన్ క్లియర్ అయింది. 1986లో ఆయన పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర రాజధాని లాహోర్‌లోని 6.75 ఎకరాల ప్రభుత్వ భూమిని ఓ మీడియా గ్రూప్ యజమానికి అక్రమంగా బదిలీ చేశారనే అభియోగాలతో అప్పట్లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసును విచారించిన పాకిస్తాన్ అకౌంటబిలిటీ కోర్టు నవాజ్ షరీఫ్‌ను నిర్దోషిగా ప్రకటించింది.

గతంలో నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్ఏబీ) నవాజ్‌పై ఈ కేసులు నమోదు చేసింది. అయితే నవాజ్ షరీఫ్ తమ్ముడు షెహబాజ్ షరీఫ్ ప్రధాని అయ్యాక ఎన్ఏబీ చట్టంలో సవరణలు చేశారు. దీంతో ఇప్పుడు ఈ కేసులు తమ పరిధిలోకి రావని ఎన్ఏబీ తరఫు న్యాయవాది కోర్టుకు స్పష్టం చేశారు. దీంతో పాకిస్తాన్ అకౌంటబిలిటీ కోర్టు నవాజ్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది.

Advertisement

Next Story

Most Viewed