Canada : కెనడాలో రైల్వే ఉద్యోగుల సమ్మె.. అమెరికాపై తీవ్ర ప్రభావం..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-08-23 00:53:25.0  )
Canada : కెనడాలో రైల్వే ఉద్యోగుల సమ్మె.. అమెరికాపై తీవ్ర ప్రభావం..!
X

దిశ, వెబ్‌డెస్క్: గురువారం నుంచి కెనడాలో రైల్వే ఉద్యోగుల సమ్మె ప్రారంభించారు. ఈ మేరకు కెనడాలోని రెండు కీలక రైల్వే నెట్ వర్కుల కార్యకలాపాలు స్తంభించిపోయాయి.దీంతో కెనడా రైల్వేతో పాటు అమెరికా ఆర్థికవ్యవస్థ పై ప్రతికూల ప్రభావం పడనుంది.వివరాల్లోకెళ్తే.. కెనడా నేషనల్‌, ది కెనడా పసిఫిక్‌ కన్సాస్‌ సిటీ సదరన్‌ సంస్థలకు చెందిన దాదాపు 9,000 మంది ఉద్యోగులు గురువారం నుంచి సమ్మెకు దిగడంతో ఈ పరిస్థితి నెలకొంది. అమెరికా-కెనడా మధ్య రైల్‌ మార్గంలో ఎగుమతి అయ్యే సరకుల్లో మూడోవంతు ఈ సంస్థలే తరలిస్తాయి. ఫలితంగా అమెరికాలోని వ్యవసాయ, ఆటోమొబైల్‌, ఇంధన పరిశ్రమలకు అవసరమైన ముడిసరకు సరఫరా చేయడంలో తీవ్ర ఆటంకాలు ఏర్పడనున్నాయి.కాగా ఈ సమ్మెను ఆపడానికి ఆ రెండు సంఘాల యాజమాన్యాలతో కెనడా కార్మిక శాఖ మంత్రి ఇప్పటికే చర్చలు జరుపుతున్నారు.

అమెరికా-కెనడా దేశాలు ఒకదానిపై మరొకటి ఆధారపడటంతో ఈ సమ్మె ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ సమ్మె వల్ల అమెరికా రైతులు ఎరువుల కొరతను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక కెనడా సరిహద్దుల్లో నిర్వహించే వాటర్‌ టీట్ర్‌మెంట్‌ ప్లాంట్లకు క్లోరిన్‌ సరఫరా కూడా నిలిచిపోనుంది.అలాగే ఈ సమ్మె వల్ల రెండు దేశాల మధ్య ఇంజిన్లు, ట్రాన్స్‌మిషన్లు, ఇతర పరికరాల సరఫరా తగ్గితే అమెరికాలోని ఆటోమొబైల్‌ పరిశ్రమలు కూడా మూతపడే అవకాశం ఉంది. రోడ్డు మార్గంలో ఈ సరకును రవాణ చేయడానికి తగినన్ని ట్రక్కులు అందుబాటులో లేవు. కెనడా నేషనల్‌(CN), ది కెనడా పసిఫిక్‌ కన్సాస్‌ సిటీ సదరన్‌ (CPKC) సంస్థలు ఏకకాలంలో సమ్మెకు దిగడం ఇదే తొలిసారి. 2022 సంవత్సరంలో CPKC సంస్థ 60 గంటలు మూతపడింది. ఇక 2019లో CN సంస్థ దాదాపు తొమ్మది రోజులపాటు సమ్మె చేసింది. అండర్సన్‌ ఎకనామిక్‌ గ్రూప్‌ అంచనాల ప్రకారం ఈ సమ్మె వల్ల మూడు రోజుల్లో 300 మిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ఆందోళనలు ఇలాగె కొనసాగితే ఈ రెండు దేశాలకు బిలియన్‌ డాలర్లు ఆర్థిక నష్టం వాటిల్లనుందని అండర్సన్‌ ఎకనామిక్‌ గ్రూప్‌ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed