బ్రెజిల్ మాజీ అధ్యక్షుడిపై మనీలాండరింగ్ ఆరోపణలు

by Harish |
బ్రెజిల్ మాజీ అధ్యక్షుడిపై మనీలాండరింగ్ ఆరోపణలు
X

దిశ, నేషనల్ బ్యూరో: బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోపై మనీలాండరింగ్‌ ఆరోపణలు వచ్చాయి. సౌదీ అరేబియా ప్రభుత్వం ఇచ్చిన విలాసవంతమైన వస్తువులతో సహా, దేశాధినేతగా ఉన్నప్పుడు అందుకున్న నగలను దుర్వినియోగం చేశారని బ్రెజిల్ ఫెడరల్ పోలీసులు ఆరోపించారు. పోలీసులు అధికారికంగా బోల్సోనారోపై నేరం మోపడం ఇది రెండోసారి. అంతకముందు ఆయన తన కొవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను తప్పుదారి పట్టించడానికి పబ్లిక్ హెల్త్ రికార్డ్‌లను మార్చమని ఒక సహాయకుడిని ఆదేశించారని పోలీసులు ఆరోపణలు మోపారు.

2019-2022 వరకు బోల్సోనారో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 2019లో సౌదీ అరేబియా ప్రభుత్వం బోల్సోనారో, ఆయన భార్య మిచెల్ బోల్సోనారోకు డైమండ్ నెక్లెస్, ఉంగరం, గడియారం, చెవిపోగులు బహుమతిగా ఇచ్చారు. వీటి విలువ దాదాపు 3 మిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. అయితే బోల్సోనారో ఆదేశాల ప్రకారం, ఆయన సహాయకులలో ఒకరైన మౌరో సిడ్ జూన్ 2022లో రోలెక్స్ వాచ్, పటెక్ ఫిలిప్ వాచ్‌ను అమెరికాలోని ఒక దుకాణంలో USD 68,000కి, ఇంకా కొన్ని నగలను విక్రయించారు. పోలీసులు గత సంవత్సరం యునైటెడ్ స్టేట్స్‌లో నగలను విక్రయించడానికి బోల్సోనారోకు సహాయం చేసిన సైనిక అధికారుల ఇళ్లను శోధించారు. పోలీసులు దర్యాప్తులో ఇదంతా కూడా నిజమని తేలడంతో బోల్సోనారో మనీలాండరింగ్, దోపిడికి పాల్పడ్డారని ఆరోపణలు మోపారు.

Advertisement

Next Story

Most Viewed