Karachi Blast: కరాచీలో బాంబ్ బ్లాస్ట్.. ముగ్గురు మృతి

by Y.Nagarani |
Karachi Blast: కరాచీలో బాంబ్ బ్లాస్ట్.. ముగ్గురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: సింథ్ ప్రావిన్స్ రాజధాని కరాచీలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. చైనా ఇన్వెస్టర్లు, ఇంజనీర్లే టార్గెట్ గా జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు సమీపంలో బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ బ్లాస్ట్ లో ముగ్గురు చైనీయులు మరణించగా.. మరో 17 మందికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. ఆదివారం అర్థరాత్రి ఈ ఘటన జరిగినట్లు ఆ దేశ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ అజ్ఫర్ మహేసర్ ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. తమకు అందిన సమాచారం ప్రకారం.. ఒక ఆయిల్ ట్యాంకర్ లో చెలరేగిన మంటలు క్రమంగా ఇతర వాహనాలకు వ్యాపించడంతో పేలుడు జరిగినట్లు తెలిపారు. ఇది ఉగ్రవాదుల చర్యగానే భావిస్తున్నట్లు తెలిపారు.

ఈ పేలుడుపై నెట్టింట వైరల్ అవుతున్న వీడియోల్లో కార్లు దగ్ధమవుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారీగా మిలటరీ బలగాలు మోహరించాయి. ఉగ్రవాదుల దాడేనన్న నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో భద్రతను పెంచాయి. ఈ దాడిలో చైనాకు చెందిన ఇంజినీర్లు చనిపోవడంతో.. కచ్చితంగా ఉగ్రదాడేనని చైనా ప్రకటించింది.

Advertisement

Next Story