అమెరికా అధ్యక్ష రేసు నుంచి బైడెన్ ఔట్.. ప్రెసిడెంట్ అభ్యర్థిగా కమలా హ్యారీస్!

by vinod kumar |   ( Updated:2024-07-17 14:58:04.0  )
అమెరికా అధ్యక్ష రేసు నుంచి బైడెన్ ఔట్.. ప్రెసిడెంట్ అభ్యర్థిగా కమలా హ్యారీస్!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈ ఏడాది నవంబర్ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాట్ల తరఫున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌లు అధ్యక్షు అభ్యర్థులుగా నామినేట్ అయ్యారు. ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. అయితే శారీరక సమస్యల కారణంగా అధ్యక్ష రేసు నుంచి బైడెన్ తప్పుకోవాలని సొంత పార్టీ నేతలతో పాటు ఆయన మిత్రులు డిమాండ్ చేశారు. అందుకు బైడెన్ నిరాకరించారు. కానీ తాజాగా బైడెన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. నేషనల్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్ వార్షిక సదస్సులో ఆయన ప్రసంగిస్తూ కమలా హ్యారీస్ పై ప్రశంసలు కురిపించారు. ‘కమలా గొప్ప ఉపాధ్యక్షురాలు మాత్రమే కాదు. ఆమె రానున్న రోజుల్లో అమెరికాకు ప్రెసిడెంట్ కావొచ్చు. అధ్యక్షురాలు అయ్యేందుకు ఆమెకు అన్ని అర్హతలూ ఉన్నాయ్’ అని వ్యాఖ్యానించారు. దీంతో అధ్యక్ష రేసు నుంచి బైడెన్ తప్పుకోబోతున్నారనే కథనాలు వెలువడుతున్నాయి. ఒక వేళ బైడెన్ వైదొలగితే తదుపరిగా కమలా హ్యారీస్ అధ్యక్ష రేసులో ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే బైడెన్ అధ్యక్ష రేసు నుంచి వైదొలగే యోచనలపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed