US President Elections: అధ్యక్ష రేసులోనే ఉన్న బైడెన్..!

by Shamantha N |
US President Elections: అధ్యక్ష రేసులోనే ఉన్న బైడెన్..!
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్ష రేసులో జో బైడెన్(US President) కచ్చితంగా ఉంటారని తెలుస్తోంది. వైట్ హౌజ్ రేసులో జో బైడెన్(Joe Biden) ఉంటారని ఆయన ప్రచారకర్తలు తెలిపారు. తన వయసు, ఆరోగ్యం దృష్ట్యా బైడెన్ అధ్యక్ష పదవి బరిలో నుంచి తప్పుకోవాలని సొంతపార్టీ నుంచే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కానీ, ఆయన బరిలోనే ఉండనున్నట్లు ఆయన క్యాంపెయిన్ టీం హెడ్ ఓమాలే డిల్లాన్ తెలిపారు. ట్రంప్ తో జరిగిన బిగ్ డిబేట్ లో బైడెన్ కొద్దిగా తడబడ్డారని అయినప్పటికీ.. అధ్యక్ష ఎన్నికల్లో ఆయన గెలుపు ఖాయమన్నారు. "కచ్చితంగా బైడెన్ అధ్యక్ష రేసులో ఉన్నారు. ట్రంప్ ను ఓడించడానికి గతంలో కంటే ఎక్కువ ఉత్సాహంగా ఉన్నారు. మీరు ఆయన నుంచి పదే పదే వినే ఉంటారు. గెలిచేందుకే ఈ పోరులో ఆయన ఉన్నారు. బైడెన్ మా నామినీ. రెండోసారి మా అధ్యక్షుడిగా ఉండబోతున్నారు" అని ఓ ఇంటర్వ్యూలో డిల్లాన్ అన్నారు.

మద్దతు కొంచెం తగ్గింది

బిగ్ డిబేట్ లో బైడెన్ అలసిపోయి, గందరగోళంగా కన్పించారని ఓమాలే డిల్లాన్ అంగీకరించారు. అందుకే చాలా కష్టసమయాన్ని ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ప్రచారంలో సవాళ్లు ఎదుర్కొంటున్నామన్న ఆమె.. తమకు కొంత మద్దతు తగ్గిందని ఒప్పుకున్నారు. కానీ, ఇది చాలా చిన్న సమస్య అని కొట్టిపారేశారు. ఇకపోతే, ఇటీవల విడుదలైన అన్ని సర్వేల్లోనూ బైడెన్ కన్నా ట్రంపే ముందంజలో కన్పిస్తున్నారు. కాగా.. బైడెన్ ప్రస్తుతం డెలావేర్ లోని తన బీచ్ హౌజ్ లో క్వారంటైన్ లో ఉన్నారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా(Barack Obama), మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ(Nancy Pelosi) సహా సీనియర్ డెమోక్రాట్లు అందరూ బైడెన్ అభ్యర్థిత్వంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూఎస్ హౌజ్ లోని 20 మంది డెమోక్రాట్లు, ఇద్దరు సెనేటర్లు బైడెన్ ను రేసు నుంచి తప్పుకోవాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed