Bangladesh: బంగాదేశ్ వ్యాప్తంగా కర్ఫ్యూ.. 105కి చేరిన మృతుల సంఖ్య

by Shamantha N |
Bangladesh: బంగాదేశ్ వ్యాప్తంగా కర్ఫ్యూ.. 105కి చేరిన మృతుల సంఖ్య
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల వివాదం ముదిరిపోయింది. వేలాది మంది రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టడంతో హింసాత్మక ఘటనలు జరిగాయి. దీంతో, షేక్ హసీనా(Sheikh Hasina) ప్రభుత్వం బంగ్లావ్యాప్తంగా కర్ఫ్యూ(curfew) విధించింది. విద్యార్థుల ఆందోళనలను అదుపు చేయడంలో పోలీసులు ఫెయిల్ కావడంతో మిలటరీని రంగంలోకి దించింది. కాగా, ఇప్పటి వరకు జరిగిన ఆందోళనల్లో 105 మంది చనిపోయారు. ఆందోళనల్లో దాదాపు 2500 మంది గాయపడ్డారు. బంగ్లా రాజధాని ఢాకాలోనే(Dhaka) 52 మంది మృతి చెందారు. పోలీసుల కాల్పుల వల్లే మరణాలు జరిగాయని పోలీసులు ఆరోపిస్తున్నారు.

నిషేధాజ్ఞలు

బంగ్లా రాజధాని ఢాకాలో ర్యాలీలు, ప్రదర్శనలు, ప్రజలు గుమికూడడాన్ని ప్రభుత్వం నిషేధించింది. ఇంటర్నెట్‌, మొబైల్ సేవలను ఆపేసింది. ఎంత కట్టడి చేసినా తమ నిరసన మాత్రం కొనసాగుతోందని స్టూడెంట్స్ తెలిపారు. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, నార్సింగ్డి జిల్లాలో ఆందోళనకారులు జైళ్లోకి దూసుకెళ్లారు. ఖైదీలను విడుదల చేసిన.. జైలుకు నిప్పంచింటారు. వందలాది మంది ఖైదీలు పారిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల చీఫ్(UN human rights chief) వోల్కర్ టర్క్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థులు, ఆందోళనకారుల దాడులు ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఈ దాడులపై నిష్పాక్షికంగా సత్వరంగా సమగ్రదర్యాప్తు చేపట్టాలని పేర్కొన్నారు. బాధ్యులను అదుపులోకి తీసుకోవాలని ప్రకటన విడుదల చేశారు. కాగా, స్వతంత్ర దేశం కోసం పాకిస్థాన్‌తో 1971లో జరిగిన విముక్తి పోరులో పాల్గొన్న వారి పిల్లలు సహా కొందరికి సగానికిపైగా సివిల్ సర్వీస్ పోస్టుల్లో ఇచ్చే రిజర్వేషన్లకు స్వస్తి చెప్పాలని విద్యార్థులు, నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. దీంతో, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed