- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దారుణం.. విద్యార్థినులపై విష ప్రయోగం
దిశ, వెబ్‌డెస్క్: విద్యార్థినులపై విష ప్రయోగం సంచలనం సృష్టించింది. ఇరాన్ లో వందలాది మంది విద్యార్థినులపై విషప్రయోగం జరిగింది. బాలికల విద్యను ఆపేయాలన్న ఉద్దేశ్యంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటన టెహ్రాన్ లోని కోమ్ లోని ఓ పాఠశాలలో చోటు చేసుకుంది. ఉద్ధేశపూర్వకంగానే ఈ ఘటన జరిగినట్లు ఆ దేశ డిప్యూటీ హెల్త్ మినిస్టర్ పనాహి తెలిపారు. ఈ విష ప్రయోగం జరిగిన తర్వాత బాలికల పాఠశాలలను మూసివేయాలని కోరినట్లు ఇరాన్ లోని మీడియా సంస్థలు వార్తా కథనాలు తెలిపాయి.
ప్రభుత్వ ప్రతినిధి బహదోరి జహ్రోమి మాత్రం ఇంటెలిజెన్స్, విద్యా మంత్రిత్వ శాఖలు ఈ ఘటనకు గల కారణాలు కనుగొనడానికి యత్నిస్తున్నట్లు తెలిపారు. ఘటపై వెంటనే దర్యాప్తు చేయాలని ఆదేశించామన్నారు. కాగా ఇటీవల ఇరాన్ లో వస్త్రాధారణ విషయమై అరెస్ట్ చేసిన 22 ఏళ్ల మహ్సా అమిని డిసెంబర్ 16న మృతి చెందిన తర్వాత ఆ దేశంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. తాజాగా ఈ ఉదంతం వెలుగులోకి రావడంతో మహిళలపై ఆంక్షల విషయంలో ఇరాన్ మళ్లీ వార్తల్లో నిలిచింది.
- Tags
- iran