గూఢచారులు కావాలి.. సీఐఏ సంచలన ప్రకటన

by Rani Yarlagadda |
గూఢచారులు కావాలి.. సీఐఏ సంచలన ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్, చైనా, ఉత్తర కొరియాల నుంచి తమకు సమాచారం అందించేందుకు గూఢచారులు కావాలని అమెరికాకు చెందిన నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సంచలన ప్రకటన చేసింది. తమ ప్రత్యేర్థి దేశాల నుంచి సమాచారం ఇచ్చేందుకు పనిచేసేవారు కావాలంటూ సీఐఏ.. మాండరీన్, కొరియా, ఫార్సీ భాషలలో సోషల్ మీడియా వేదికలైన X, ఫేస్ బుక్, యూట్యూబ్, ఇన్ స్టా గ్రామ్, టెలిగ్రామ్, లింక్డిన్ లలో చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ప్రకటన చేయడమే కాకుండా సీక్రెట్ గా తమను ఎలా సంప్రదించాలో కూడా ఈ పోస్టులో చెప్పడం ఒక్క ఎత్తైతే.. డార్క్ వెబ్ లో కూడా ఈ ప్రకటన కనిపించడం గమనార్హం. VPN, టోరో నెట్ వర్క్ ల ద్వారా తమ అధికారిక వెబ్ సైట్ లో సంప్రదించాలని సూచించింది.

అయితే.. తమను సంప్రదించేవారు ఆయా దేశాలలో పనిచేసే వీపీఎన్ లను వాడొద్దని సీఐఏ హెచ్చరించింది. నియంతృత్వ దేశాల్లో ఉన్నవారితో కూడా డీల్ చేసేందుకు సీఐఏ సిద్ధంగా ఉందని ఆ సంస్థ ప్రతినిధి ఒకరు మరో ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో రష్యా కూడా ఇలాంటి వ్యూహాన్నే వాడి విజయం సాధించినట్లు సియోల్ హాంకాక్ యూనివర్సిటీ ఆఫ్ ఫారెన్ సర్వీస్ ప్రొఫెసర్ మాసొన్ రిచీ వెల్లడించారు. కానీ.. సీఐఏ ఏయే దేశాల నుంచైతే ఇన్ ఫార్మార్లు కావాలని ప్రకటన ఇచ్చిందో.. ఆయా దేశాలతో పాటు ఇరాన్ కూడా అమెరికాకు చెందిన ఫేస్బుక్, ఎక్స్, యూ ట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ను నిషేధించాయి.

Advertisement

Next Story