అడవిలో ఒంటరిగా మిగిలిపోయిన మహిళ.. ఐదురోజులు వైన్, లాలీపాప్‌లతో సర్వైవ్

by Anjali |
అడవిలో ఒంటరిగా మిగిలిపోయిన మహిళ.. ఐదురోజులు వైన్, లాలీపాప్‌లతో సర్వైవ్
X

దిశ, వెబ్‌డెస్క్: అడవిలో ఒంటరిగా మిగిలిపోయిన 48 ఏళ్ల మహిళ.. సుమారు ఐదు రోజుల పాటు కేవలం లాలీపాప్ లు, వైన్ లతో సర్వైవ్ అయింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన లిలియన్ అనే మహిళ కారు బురదలో కూరుకుపోవడం తో ఐదు రోజుల పాటు దట్టమైన అడవిలో తప్పిపోయింది. దీంతో పిల్లల కోసం కొన్న లాలీపాప్ తింటూ.. తన తల్లి కోసం కొన్న మద్యం సేవిస్తూ సుమారు ఐదు రోజుల పాటు జీవనం సాగించింది. అయితే మహిళ కోసం పోలీసులు హెలికాఫ్టర్ ద్వారా గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకు ఆమెను కనుగొని తన ఇంటికి చేర్చారు.

Advertisement

Next Story