ఏనుగును పోటో తీయాల‌నుకుంది.. చెంప ఛెళ్లంది పాపం..! (వీడియో)

by Sumithra |
ఏనుగును పోటో తీయాల‌నుకుంది.. చెంప ఛెళ్లంది పాపం..! (వీడియో)
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ఒక సింహాన్ని ఆడించాల‌నుకున్న వ్య‌క్తి చేతి వేళ్ల‌ను ఆ సింహం కొరికిన ఘ‌ట‌న ఇటీవ‌ల వార్త‌ల్లోకెక్కింది. ప్ర‌స్తుతం ఇంట‌ర్నెట్‌లో ఇలాంటి మ‌రో వీడియో చక్క‌ర్లుకొడుతోంది. అయితే, ఇక్క‌డ ఏనుగుతో ఆమె ఆడాల‌ని ప్ర‌య‌త్నించ‌లేదు, కేవ‌లం ఒక ఫోటో తీసుకోడానికి ప్ర‌య‌త్నించింది అంతే, వెంట‌నే ఆ ఆఫ్రికన్ ఏనుగు కోపంగా, దాని తొండంతో అమ్మాయిని ముఖంపై కొట్టిండి. సాధార‌ణంగా, ఏనుగులు మ‌నుషుల‌తో చాలా సామాజికంగా, స్నేహపూర్వకంగానే ఉంటాయని మనందరికీ తెలుసు. కానీ ఈ సందర్భంలో కాస్త భిన్నంగా జంబో ఉద్రేకపడింది. అయితే, ఫోటో ఘ‌ట‌న‌కు ముందు, అక్క‌డున్న ఇంకొంద‌రు వ్యక్తులు ఏనుగు తొండాన్ని తాక‌డానికి ప్రయత్నించ‌డం వీడియోలో చూడొచ్చు. అయితే, అప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌శాంతంగానే ఉన్న ఏనుగు అమ్మాయి స్మార్ట్‌ఫోన్‌ తీసి ఫోటో క్లిక్ చేసే కొన్ని సెకన్లలో తొండంతో దాడి చేస్తుంది. బాలిక కిందపడిపోవడంతో ప‌క్క‌నున్న‌వాళ్లు ఆమెను తీసుకెళ్లేందు ప్రయత్నిస్తారు. ఇంతలో, ఏనుగు తన ట్రంక్‌తో ఫోన్‌ను తీయడానికి ప్రయత్నిస్తుంది. ఈ వీడియోని @cctv_idiots అనే హ్యాండ్లర్ ట్విట్టర్‌లో షేర్ చేసారు.

ఈ సంఘటనను వివరిస్తూ, అమ్మాయి ఫాక్స్ న్యూస్‌తో.., "ఒకేసారి 10 మంది నన్ను కొట్టినట్లు నాకు అనిపించింది. అయితే, నేను బాగానే ఉన్నాను. నేను ఇప్పటికీ ఏనుగులను ప్రేమిస్తున్నాను!" అని చెప్పింది. పెన్సిల్వేనియాకు చెందిన ఈ బాలిక తన హైస్కూల్ టూర్‌లో భాగంగా జాంబియాలో 12 రోజుల మిషన్ ట్రిప్‌లో ఉండగా ఈ సంఘటన జరిగింది. ఈ వీడియోకు నెటిజ‌న్ల నుండి మిశ్రమ స్పందనలను వ‌స్తున్నాయి. కొంతమంది స్మార్ట్‌ఫోన్ కారణంగా జంబో చిరాకు పడింద‌ని అన్నారు. మ‌రొక‌రు, అటువంటి ప్రవర్తనకు కారణాన్ని వివరిస్తూ, "నేను ఎక్కడో చదివాను. కొన్నిసార్లు జంతువులు కెమెరాల నుండి దూరంగా ఉంటాయి. ఎందుకంటే, అవి వాటిని తుపాకీలని అనుకుంటాయి. అందుకే రక్షణ కోసం ఇలా ప్రవర్తిస్తాయి" అని అన్నారు.

Advertisement

Next Story