రెండేళ్ల బాలుడికి జీవితఖైదు.. ఇంతకి ఆ బాబు చేసిన నేరమేంటి..?

by Mahesh |   ( Updated:2023-06-20 10:58:14.0  )
రెండేళ్ల బాలుడికి జీవితఖైదు.. ఇంతకి ఆ బాబు చేసిన నేరమేంటి..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తర కోరియాలో దేశంలో రూల్స్ ఏ విధంగా ఉంటాయో మన అందరికి తెలిసిందే.. అయితే తాజాగా ఆ దేశంలో జరిగిన ఓ సంఘటన యావత్ ప్రపంచాన్ని విస్తుపోయే విధంగా చేసింది. కేవలం రెండంటే రెండు సంత్సరాల వయస్సు ఉన్న బాబుకు ఆ దేశ ప్రభుత్వం జీవిత ఖైదు విధించింది. ఇంతకీ ఆ బాబు చేసిన నేరం ఎంటీ.. అంత చిన్న వయసులో మాటలు కూడా రావు, ఎంత పెద్ద నేరం ఏమి చేశాడని.. జీవిత ఖైదు విధించారని కొరియా దేశం పై విమర్శలు చేస్తున్నాయి.

అయితే ఆ బాబు చేసిన నేరం ఎంటంటే..?

US స్టేట్ డిపార్ట్‌మెంట్ నివేదిక ప్రకారం.. ఉత్తర కొరియాలో ప్రజలకు జీవించే హక్కు ఉన్నప్పటికీ.. వారు కొన్ని నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుంది. ఆ నిబంధన ప్రకారం.. కుటుంభం ఉత్తర కొరియాలో బైబిల్‌తో పట్టుబడిన క్రైస్తవులు మరణశిక్షను ఎదుర్కొంటారు. అలాగే.. ఆ కుటుంభంలోని పిల్లలు, వారి కుటుంబ సభ్యులు జీవిత ఖైదు చేయబడతారని స్పష్టంగా ఉంటుంది. దీని ప్రకారం.. మతపరమైన ఆచారాలు, బైబిల్ కలిగి ఉన్నందుకు 2009లో కుటుంబాన్ని అరెస్టు చేశారు. రెండేళ్ల పిల్లవాడితో సహా మొత్తం కుటుంబానికి రాజకీయ జైలు శిబిరంలో జీవిత ఖైదు విధించబడింది. వారికి శిక్ష శిబిరాల్లో.. భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. ఈ సంఘటన తాజాగా వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్‌గా మారిపోతుంది.

Advertisement

Next Story

Most Viewed