ఆస్ట్రేలియాలో తెలుగు మహిళ దారుణ హత్య.. ఓ చెత్త డబ్బాలో మృతదేహం!

by Ramesh N |
ఆస్ట్రేలియాలో తెలుగు మహిళ దారుణ హత్య.. ఓ చెత్త డబ్బాలో మృతదేహం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆస్ట్రేలియాలో తెలుగు వైద్యురాలి మృతి ఘటన మరువక ముందే మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తాజాగా మరో మహిళ దారుణ హత్య కలకలం రేపుతోంది. ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో హైదరాబాద్‌కు చెందిన మహిళ చైతన్య మాధగాని అలియాస్ శ్వేత దారుణ హత్యకు గురైంది. మృతదేహాన్ని రోడ్డు పక్కన ఉన్న చెత్త డబ్బాలో పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన విక్టోరియా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ కేసులో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మహిళను హత్య చేసిన నిందితుడు విదేశాలకు పారిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఆస్ట్రేలియాలోని మిర్కావే, పాయింట్ కుక్‌లో మహిళ నివాసం ఉండేవారు. అయితే మృతురాలు భర్త ఆశోక్ రాజ్ ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చారు.

Advertisement

Next Story

Most Viewed