న్యూఇయర్ రోజే కుదిపేసిన భూకంపం.. అణు కేంద్రాల వద్ద టెన్షన్

by GSrikanth |   ( Updated:2024-01-02 05:00:08.0  )
న్యూఇయర్ రోజే కుదిపేసిన భూకంపం.. అణు కేంద్రాల వద్ద టెన్షన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: న్యూ ఇయర్‌లో తొలి రోజే జపాన్‌ను భారీ భూకంపం కుదిపేసింది. భారత కాలమానం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం మధ్య జపాన్ లో వరుసగా భారీ భూకంపాలు నమోదు అయ్యాయి. మొదట 5.7 తీవ్రతతో ఆ ప్రకంపనలు మొదలయ్యాయి. ఒక దశలో తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 7.6గా నమోదైందని యూఎస్‌ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. దీంతో జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఇషికావా, నీగాటా, టొయామా తీర ప్రాంతాలలో అలలు ఎగిసిపడుతున్నాయి. 5 మీటర్ల మేర ఎత్తుతో అలలు తీరం వైపు దూసుకువస్తున్నాయి. భూకంపం ధాటికి రోడ్లు, భవనాలు, విద్యుత్ స్థంబాలు నేలకొరిగాయి. ప్రజలంతా న్యూఇయర్ జోష్ లో ఉన్న సమయంలో ఒక్కసారి భూమి వణికిపోవడంతో ఎక్కడ చూసిన భీతావాహ పరిస్థితి కనిపించింది. అప్రమ్తమైన అధికారులు తీర ప్రాంత ప్రజలను ఎత్తైన ప్రదేశాలకు తరలిస్తున్నారు.అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. రహదారులు మూసివేశారు. బుల్లెట్ ట్రైన్ సర్వీసులను సైతం నిలిపివేశారు.

అణు కేంద్రాల వద్ద టెన్షన్:

భూకంపం ప్రభావనంతో హోకురీకు అణువిద్యుత్ ప్లాంట్ల విషయంలో ఆందోళన వ్యక్తం అవుతోంది. భూకంపం ప్రభావంఅణుకేంద్రాలపై ఉందా అనే విషయాన్ని పరిశీలిస్తున్నామనిహొకురీకు ఎలక్ట్రిక్‌ పవర్‌ సంస్థ వెల్లడించింది. మరోవైపు ఇషికావాకు చెందిన వాజిమా తీరాన్ని అలలు బలంగా తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 2011లో మార్చి నెలలో భారీ భూకంపం సంభవించం వల్ల అణుకర్మారాగం పూర్తిగా దెబ్బతింది. జపాన్‌లో సునామీ హెచ్చరికలతో రష్యా అప్రమత్తమైంది. సఖాలిన్ కు సైతం సునామీ హెచ్చరికలు జారీ చేసింది.

2011 విధ్వంసం ఇంకా కళ్లముందే:

2011లో జపాన్ తూర్పు ద్వీపంలో నమోదైన బలమైన భూకంపం ఈశాన్య జపాన్ ను వణికించింది. ఓషికాకు 70 కిలోమీటర్ల దూరంలో రిక్టర్ స్కేలుపై 9 తీవ్రతతో భూకంపం సంభవించగా దాదాపు 20 నిమిషాల తర్వాత సునామీ అలలు ఉత్తరాన హక్కైడో, దక్షిణాన ఒకినావా దీవులను తాకాయి. ఈ విధ్వంసంలో 15,000 మందికి పైగా మరణించారు. జాతీయ పోలీసు ఏజెన్సీ ప్రకారం, ఇంకా దాదాపు 2,000 మందికి పైగా గల్లంతయ్యారు. ఇది జపాన్‌లో ఇప్పటివరకు నమోదైన అత్యంత శక్తివంతమైన భూకంపాలలో ఒకటిగా నిలిచింది. 1900 లో ఆధునిక రికార్డ్ కీపింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచంలో నాలుగో అత్యంత శక్తివంతమైన భూకంపంగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed