- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Brazil | 16 ఏళ్ల అమ్మాయిని పెళ్లాడిన 65 ఏళ్ల మేయర్.. 36 ఏళ్ల అత్తకు జాబ్ ప్రమోషన్..
దిశ వెబ్ డెస్క్ : బ్రెజిల్లో( Brazil ) 65 ఏళ్ల వయసున్న ఒక నగర మేయర్ 16 ఏళ్ల బాలికను ఇటీవల పెళ్లి చేసుకున్నాడు. ఆ మేయర్‌కి అమ్మాయి కంటే వయస్సులో దాదాపు 50 ఏళ్ల పెద్దవాడు. ఈ జంట మధ్య ఇంత వయో వ్యత్యాసం ఉండటంతో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయం అంతటితో ఆగలేదు, ఈ మేయర్( Brazilian Mayor ) తన అత్తగారికి, అంటే అమ్మాయి తల్లికి సాంస్కృతిక, పర్యటక శాఖ కార్యదర్శి పదవిని కట్టబెట్టారు. ఉద్యోగ జీతం కూడా 1500 డాలర్లు పెరిగింది. దీంతో ఈ వ్యవహారం చర్చినీయాంశమయ్యింది.
వివరాల్లోకి వెళితే.. దక్షిణ బ్రెజిల్‌లోని అరౌకారియా నగరానికి హిస్సామ్ హుస్సేన్ దేహైని (Hissam Hussein Dehaini) అనే 65 ఏళ్ల వ్యక్తి మేయర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. హిస్సామ్ ఇది వరకే అయిదు సార్లు పెళ్లి చేసుకొని భార్యలకు విడాకులిచ్చాడు. అతనికి మొత్తం 16 మంది పిల్లలున్నారు. అయితే ఇంతకుముందు వరకు అతని గురించి ఎవరికీ పెద్దగా తెలియలేదు కానీ 16 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత అతడి పేరు దేశమంతటా మార్మోగిపోతోంది. ఆ అమ్మాయి తన 16వ ఏట పూర్తైన నాలుగు రోజులకే మేయర్ హిస్సామ్‌ని పెళ్లి చేసుకోవడం గమనార్హం.
ఈ పెళ్లితో అతడు పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు.పెళ్లి చేసుకోవడం మాట అటుంచితే తల్లికి పదోన్నతి ఇవ్వడం మరింత వివాదాస్పదంగా మారింది. అవినీతి, బంధుప్రీతికి సదరు మేయర్ పాల్పడ్డాడని చాలామంది ఫైర్ అవుతున్నారు. పరిస్థితి మరింత సీరియస్‌గా మారినందున మేయర్ అత్తగారిని పదవి నుంచి సస్పెండ్ చేసి విచారణ సంస్థలు దర్యాప్తు ప్రారంభించాయి.
మనదేశంలో పెళ్లి కావాలంటే అమ్మాయికి 21 ఏళ్లు నిండి ఉండాలి.కానీ బ్రెజిల్ చట్టాల ప్రకారం 16 ఏళ్ల నిండిన అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. కాకపోతే తల్లిదండ్రుల అనుమతి పొందాల్సి ఉంటుంది. కాగా అమ్మాయికి 16 ఏళ్లు దాటిన మరుసటి రోజే హుస్సేన్ పెళ్లి చేసుకున్నారు.ఇక ఆ బాలిక తల్లి విద్యా శాఖలో ఉద్యోగం చేసేది. అయితే తక్కువ శాలరీ వస్తుందని, హోదా కూడా పెద్దది కాకపోవడంతో ఆమె మేయర్‌ని ఉన్నత పదోన్నతి కోసం అడిగింది.
అందుకు పిల్లను ఇచ్చి పెళ్లి చేయాలని అతడు షరతు పెట్టాడో.. లేక అత్తగారే అమ్మాయిని పెళ్లి చేసుకోమని ఆఫర్ ఇచ్చిందో.. తెలియలేదు కానీ.. మొత్తానికి ముసలోడు అని కూడా చూడకుండా తన పిల్లనిచ్చి పెళ్లి చేసింది.