9.5 లక్షలకు కరోనా కేసులు

by  |
9.5 లక్షలకు కరోనా కేసులు
X

వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 9.5 లక్షలకు చేరాయి. కాగా, మృతుల సంఖ్య 50 వేలకు(48,320) చేరువవుతున్నాయి. ప్రస్తుతం కరోనా యూరప్ దేశాలను కుదిపేస్తున్నది. ఈ ఖండంలోనే కరోనా మరణాల సంఖ్య 30 వేలను దాటింది. ఇటలీ, స్పెయిన్ లలోనే సుమారు 23 వేలు మరణించారు. స్పెయిన్ లో కరోనా మరణాలు పదివేల మార్క్ దాటేశాయి. ఇటలీలో 13,155 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధిక కరోనా కేసులు అమెరికాలో రిపోర్ట్ అయ్యాయి. ఆ దేశంలో కరోనా కేసులు రెండు లక్షలను దాటగా.. మరణాలు ఐదు వేలను మించిపోయాయి. వారం రోజుల్లోనే మరణాల సంఖ్య రెట్టింపు కావడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

అమెరికాలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో వెంటిలేటర్లు, రక్షణ పరికరాల కొరత ఏర్పడుతున్నది. దీంతో రష్యా నుంచి వెంటిలేటర్లు, మెడికల్ ఎక్విప్మెంట్ లను కొనుగోలు చేసేందుకు అమెరికా సిద్ధమైంది. ఇప్పటికే దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో మాట్లాడారు. కొనుగోలు ఒప్పందం ఖరారైంది.

Tags : Coronavirus, global, cases, deaths

Next Story

Most Viewed