- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇర్ఫాన్ ఆలోచనల్లో ఆర్తి… నటనలో స్ఫూర్తి
ఇర్ఫాన్ ఖాన్… ప్రపంచపు సినిమా కిరీటం. ఆయన నటన… ఒక డిక్షనరీ. ఆయన ఆలోచన… జీవిత కాలపు అనుభవం. ఆయన ప్రవర్తన… సహ నటులకు స్ఫూర్తి. ఆయన జీవితం… జీవితాంతం పాఠాలు నేర్చుకునే తత్వం. ప్రతీ ఒక్కరి పట్ల దయగా ఉండాలని సూచించే ఇర్ఫాన్… పేరు ప్రఖ్యాతలు, కీర్తిని ఒక రోగంగా అభివర్ణించాడు. ఎప్పటికైనా ఆ వ్యాధి నుంచి బయటకు రావాలని కోరుకున్నాడు. కీర్తి గురించి ఎప్పుడూ పట్టించుకోని ఇర్ఫాన్.. జీవితాన్ని ప్రతీ క్షణం ఆస్వాదించడం ముఖ్యమని నమ్మారు.
ఇర్ఫాన్ ఖాన్ 1967 జనవరి 7న రాజస్థాన్ రాష్ట్రంలోని ఖజురియా గ్రామంలో సైదా బేగం ఖాన్, యసీన్ అలి ఖాన్ లకు జన్మించారు. సాధారణంగా ఇర్ఫాన్ కు క్రికెట్ అంటే ఇంట్రెస్ట్. CK నాయుడు టోర్నమెంట్ కు కూడా సెలెక్ట్ అయ్యాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడలేకపోయాడు. ఇదే ప్రపంచానికి ఒక గొప్ప నటుడిని పరిచయం చేసేందుకు కారణం అయింది. ఇర్ఫాన్ ను నటనలో ఓనమాలు నేర్చుకునేలా చేసింది. జైపూర్ లో MA పూర్తి చేసిన ఖాన్ … యాక్టింగ్ నేర్చుకునేందుకు 1984లో ఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేరాడు.
అక్కడి నుంచి ముంబైకి పయనమైన ఖాన్… తొలుత సీరియళ్లలో నటించారు. చాణక్య, చంద్రకాంత, భారత్ ఎక్ ఖోజ్ లాంటి సీరియల్స్ లో నటించిన ఇర్ఫాన్.. స్టార్ ప్లస్ లో ప్రసారమైన డర్ సీరియల్ లో సైకో కిల్లర్ గా నటించి ప్రశంసలు అందుకున్నాడు. అంతేకాదు అలి సర్దార్ జాఫ్రీ నిర్మించిన కహకషన్ సీరియల్ లో ప్రముఖ విప్లవ ఉర్దూ కవి, భారత దేశ మార్క్సిస్టు రాజకీయ కార్యకర్త మాఖ్డూం మొహియుద్దీన్ పాత్రలో జీవించిన తీరు మెప్పుపోందింది. ఆ తర్వాత స్టార్ బెస్ట్ సెల్లర్, భన్వర్ లాంటి సీరియళ్లలో కనిపించిన ఇర్ఫాన్…తొలిసారి వెండితెరపై కనిపించింది సలాం బాంబే సినిమాలోనే. మీరా నాయర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇర్ఫాన్ కు అంత బ్రేక్ ఇవ్వలేకపోయింది. తర్వాత కొన్ని సినిమాలు చేసిన అసలు రిలీజ్ అయ్యాయి కూడా తెలియని పరిస్థితి.
ఇన్ని ఫెయిల్యూర్స్ తర్వాత లండన్ కు చెందిన దర్శకుడు అసిఫ్ కపాడియా ది వారియర్ సినిమాలో ఇచ్చిన చాన్స్ ఇర్ఫాన్ ను ప్రపంచ స్థాయి నటుడిగా నిలబెట్టేందుకు పునాది వేసింది. 2001లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శితమైన ఈ చిత్రం… ఇర్ఫాన్ ను ప్రపంచానికి పరిచయం చేసింది.
మక్బూల్..
30 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో గొప్ప పాత్రలు చేసిన ఇర్ఫాన్… ది వారియర్ సినిమా తర్వాత అశ్విన్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన రోడ్ టు లడఖ్ షార్ట్ ఫిల్మ్ చేశారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో గొప్ప ప్రశంసలు అందుకున్న ఈ సినిమా తర్వాత… 2004 లో “మక్బూల్” చిత్రంలో టైటిల్ రోల్ పోషించారు. షేక్స్ పియర్ మెక్బెత్ నవల కథ ఆధారంగా రూపొందిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ లో ఇర్ఫాన్ స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ విమర్శకులు సైతం వావ్ అనిపించేలా చేసింది. డైరెక్టర్ విశాల్ భరద్వాజ్ ఇర్ఫాన్ నటనను వాడుకున్న విధానానికి విమర్శకులు సాహో అనక తప్పలేదు.
హాజిల్..
ఈ సినిమా కథ యూనివర్సిటీలో రాజకీయం, విద్యార్థుల చుట్టూ ఉండగా… ఇర్ఫాన్ విలనిజంకు వందశాతం మార్కులు పడ్డాయి. ఆయన సినిమాలో కనిపించే తీరు ప్రేక్షకులను భయంతో కుర్చీలో నుంచి లేచి నిలబడేలా చేసిందని విమర్శకులు కీర్తించగా.. ఈ చిత్రానికి ఫిల్మ్ ఫేర్ బెస్ట్ విలన్ అవార్డ్ అందుకున్నాడు. ఈ ఏడాదే తెలుగులో మహేష్ బాబు హీరోగా వచ్చిన సైనికుడు సినిమాలో పప్పు యాదవ్ గా నటించిన ఇర్ఫాన్ ఖాన్… తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
పాన్ సింగ్ తోమర్..
ఎన్నో చెరగని సినిమా జ్ఞాపకాలతో ప్రపంచ సినిమాను సుసంపన్నం చేసిన ఇర్ఫాన్… పాన్ సింగ్ తోమర్ చిత్రానికి నేషనల్ అవార్డ్ తో సత్కరించబడ్డారు. టైటిల్ రోల్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ఇర్ఫాన్… ఇండియన్ సినిమా చరిత్రలో క్లాసికల్ ఫిల్మ్ గా నిలిచిపోయిన షోలే సినిమాను మరిపించెలా ఇర్ఫాన్ నటన ఉందని క్రిటిక్స్ కితాబిచ్చారు. ఇర్ఫాన్ యాక్టింగ్ లో సింప్లిసిటీ అదుర్స్ అంటూ ప్రశంసించారు.
పికు..
పికు…. ఔట్ స్టాండింగ్ మూవీ… సుజిత్ సర్కార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా తండ్రి కూతుళ్ళ మధ్య బంధాల నడుమ సాగుతుంది. షాట్ టెంపర్ గాళ్ గా దీపిక … తండ్రిగా అమితాబ్ బచ్చన్ నటించగా… వీరిద్దరి మధ్య నలిగిపోయే పాత్రలో ఇర్ఫాన్ నటన, కామిక్ టైమింగ్ వావ్ అనిపించేలా ఉంటుంది.
కమర్షియల్ సినిమాలు తనకు సూట్ కావేమో అని చెప్పే ఇర్ఫాన్ ఖాన్ నటించిన చిత్రాల్లో టాప్ బ్రిలియంట్ మూవీస్…. ద లంచ్ బాక్స్, తల్వార్, లైఫ్ ఆఫ్ పై, స్లమ్ డాగ్ మిలియనీర్, లైఫ్ ఇన్ ఏ మెట్రో, హిందీ మీడియం. ఈ సినిమాల్లో ఇర్ఫాన్ అద్భుత నటనను… ఏ నటుడు కూడా రీ ప్లేస్ చేయలేరు. ఒక విమర్శకుడు చెప్పిన మాట… ఇర్ఫాన్ ఫ్రేమ్ లో ఉంటే తన కళ్లు పలికే హావభావాలు చాలు… తనకు డైలాగ్ లేకపోయినా సరే… ఆయన చెప్పాలి అనుకున్నది ప్రేక్షకులకు ఆటోమేటిక్ గా అర్ధం అయిపోతుంది అని. పలు బ్రిటిష్, హాలీవుడ్ ఫిల్మ్స్ లో నటించిన ఇర్ఫాన్… ఇండియన్ సినిమా బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిపోయాడు. అమెరికన్ సినిమాలో రొమాంటిక్ లీడ్ రోల్ చేసిన యాక్టర్ గా గుర్తుండిపోతాడు.
ఇతర నటులతో ఇర్ఫాన్ కు పోలికా… అసలే వద్దంటారు తోటి నటులు. ఆయన అద్భుత నటన, మనోహరమైన ప్రవర్తన, అందరినీ సమానంగా చూడగల తత్వం .. ఇలాంటి నటుడిని చూసి ఉండమని చెప్తుంటారు. సినిమాకు భాష అవసరం లేదు భావం చాలని నమ్మే లెజెండరీ యాక్టర్ ఇర్ఫాన్ ను…. ఒక ఆణిముత్యంగా అభివర్ణిస్తూ కన్నీటితో కడసారి వీడ్కోలు పలుకుతున్నారు.
Tags : Irrfan Khan, World Cinema, Bollywood, Tollywood