టైమ్స్ ఆఫ్ ఇండియాలో వర్క్ ఫ్రమ్ హోం

by Shamantha N |   ( Updated:2020-03-16 04:14:38.0  )
టైమ్స్ ఆఫ్ ఇండియాలో వర్క్ ఫ్రమ్ హోం
X

దేశంలో కోవిడ్-19(కరోనా) వేగంగా వ్యాప్తి చెందుతున్నందున ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఇప్పటికే సాఫ్ట్‌వేర్ కంపెనీ‌లు ఉద్యోగులు ఎవరూ ఆఫీస్‌లకు రావాల్సిన అవసరం లేదని తెలిపాయి. వర్క్ అంతా ఇంటి నుంచే చేయాలని ఆదేశాలు జారీచేశాయి. ప్రస్తుతం మీడియా సంస్థలు కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. దేశరాజధాని ఢిల్లీ, ముంబాయి, హైదరాబాద్‌లోని ప్రముఖ జాతీయ ఆంగ్ల దిన పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టర్లకు సోమవారం నుంచి వర్క్ ఫ్రమ్ హోం చేసేందుకు యాజమాన్యం అనుమతినిచ్చింది. రిపోర్టర్లు, మార్కెటింగ్ ఉద్యోగులు, ఫీల్డ్‌లో తిరిగే ఇతర ఉద్యోగులకు ఈ అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొంది. వీరంతా జనాలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో సంచరిస్తారు కావున వైరస్ సులభంగా విజృంభించే అవకాశం ఉన్నందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
Tags: works from home, media field, hyd, delhi, mumbai, times of india

Advertisement

Next Story

Most Viewed