- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీతాల కోసం కార్మికుల ఆందోళన
దిశ, రంగారెడ్డి: కొందుర్గు మండల కేంద్రంలో ఉన్న స్కాన్ పవర్ ఎనర్జీ అండ్ లిమిటెడ్ స్టీల్ పరిశ్రమ వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని అందులో పనిచేసే కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇందుకు నిరసనగా షాద్‌నగర్ ఆర్డీవో కార్యాలయం ముందు బుధవారం ఆందోళనకు దిగారు. రెండు నెలలుగా వేతనాలు చెల్లించట్లేదని కార్మికులు వాపోయారు. లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వ జీవో నెంబర్ 167 ప్రకారం అందరికీ జీత భత్యాలు చెల్లించాల్సి ఉన్నా.. యాజమాన్యం అవేమీ పట్టించుకోవట్లేదని తెలిపారు. సమాచారం తెలుసుకున్న కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు పినపాక ప్రభాకర్, ఫరూక్ నగర్ మండల టీఆర్‌ఎస్ జెడ్పీటీసీ వెంకటరామిరెడ్డి కార్మికులతో మాట్లాడారు. స్కాన్ ఎనర్జీ స్టీల్ కంపెనీ యాజమాన్యంపై వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు. కార్మికుల బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. కాగా, ఈ పరిశ్రమలో ఉత్తరప్రదేశ్, బీహార్, ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు దాదాపు 700 మంది పనిచేస్తున్నారు.
tag; workers, RDO office, protest, shadnagar, rangareddy district