- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘డబుల్’ ఇళ్ల పంపిణీలో అక్రమాలు.. కన్నీరు పెట్టుకున్న మహిళలు
దిశ, ఖమ్మం టౌన్: ఖమ్మం నగరంలో డబుల్ బెడ్రూం ఇండ్లకోసం పేదలు ఇబ్బందులు పడుతున్నారు. ఇండ్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వ హామీని స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకుండా.. వారికి సంబంధించిన వారికే ఇప్పిస్తున్నారని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడు పేదరికంతో అలమటిస్తున్న తమకు ప్రభుత్వం పక్కా ఇల్లు ఇచ్చి ఆదుకుంటుందని ఆశిస్తుంటే కొందరు నేతలు తమకు ఇల్లు రాకుండా చేస్తున్నారని వాపోయారు. ఖమ్మం పట్టణంలోని 36, 37, 35, 33, 34, డివిజన్లలో పేదలు ఇండ్లు లేక ఇబ్బందులు పడుతుంటే పట్టించుకునే నాధుడే కరువయ్యారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. 3వ పట్టణ ప్రాంతంలో ఎక్కువశాతం జహీర్‌పురతాండ, ఎస్సీ కాలనీ, పంపింగ్ వెల్ రోడ్, మార్కెట్ రోడ్, వడ్డెర కాలనీ, ప్రాంతాల్లో ఎక్కువమంది పేదలు సొంత ఇల్లు లేక అద్దె ఇండ్లలో కిరాయిలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గోస వెల్లడించారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చిన నాయకులు ఇప్పుడు మొఖం కూడా చూడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోళ్ళపాడు కెనాల్ కాలువపై నివాసం కోల్పోయిన వారికి మంత్రి ఇండ్లు ఇస్తామని చెప్పి ఇంతవరకూ ఇంటి పట్టాలు ఇవ్వలేదని వాపోతున్నారు. ఇళ్లు లేని వారికి ప్రాధాన్యత ఇస్తారనుకుంటే ప్రజాప్రతినిధుల బంధువులకు ఇస్తున్నారని జహీర్‌పుర తండా మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానిక కార్పొరేటర్ తనకు సంబంధించిన చుట్టాలను పేదలుగా చూపించి, మాకు వచ్చిన పట్టాలను కూడా మార్పించారని ఆరోపిస్తున్నారు. ఇండ్ల కేటాయింపు విషయంలో తహసీల్దార్ కార్యాలయంలో తయారు చేసిన లిస్ట్‌లో పేర్లు మార్చి లబ్ధిదారుల స్థానంలో ప్రస్తుత కార్పొరేటర్ బంధువులు, ధనవంతులకే పట్టాలు కట్టబెట్టారని ఆవేదనతో కన్నీరు పెట్టుకున్నారు. కనీసం.. భర్తలేని మహిళలు అని కూడా చూడకుండా.. ప్రస్తుత కార్పొరేటర్ కర్కషంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. గత ఆరు నెలలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా.. అధికారులు, అధికారపార్టీ నాయకులకే మొగ్గుచూపుతూ.. పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రోధిస్తున్నారు. తమకు ఎక్కడా.. ఇండ్లు లేవని తన భర్త చనిపోయి 15 ఏండ్లుగా తమ పిల్లలతో అరటిపండ్లు అమ్ముకుంటూ ఇంటిరెంటు కట్టుకుంటు జీవనం సాగిస్తున్నానని వాపోయారు. తమకు తెల్ల రేషకార్డు ఉన్నా.. ఇంతవరకు ఇంటి పట్టాలు ఇవ్వలేదని ఓ మహిళ తన ఆవేదన తెలిపారు. ఆమెతోపాటు మరికొంతమంది మహిళలు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. మంత్రి ఇలాకలోనే స్థానిక ప్రజాప్రతినిధులు ఇలా చేస్తే ఎలా అని స్థానిక మహిళలు ప్రశ్నిస్తున్నారు.