పేకముక్కల్లో ‘కింగ్’ ‘క్వీన్’ ‘జాక్’ కనిపించవు

by Shyam |
పేకముక్కల్లో ‘కింగ్’ ‘క్వీన్’ ‘జాక్’ కనిపించవు
X

దిశ, వెబ్‌డెస్క్: వేళ్లూనుకుపోయిన పురుషాధిక్య సమాజంలో మహిళలు ఇప్పుడిప్పుడే అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఏళ్లుగా చాలా విషయాల్లో పురుషుల కంటే మహిళలను తక్కువస్థాయిలో చూపించే ప్రయత్నం చేశారు. వంటింట్లోకి అబ్బాయిలకు ప్రవేశమే లేదన్నట్లు, పెళ్లిలో అమ్మాయిలే అబ్బాయిల కాళ్లు మొక్కడం సంప్రదాయాలు పురుషాధిక్యతకు నిదర్శనం కాగా, పేక ముక్కల్లోనూ ‘క్వీన్’ కంటే ‘కింగ్’ స్థాయికే పట్టం కట్టాం. ప్లేయింగ్ కార్డ్స్‌లోని ఈ సెక్సువల్ ఇన్-ఈక్వాలిటీని చెరిపేసి, జెండర్ న్యూట్రల్ కార్డ్స్ తీసుకొచ్చింది నెదర్లాండ్స్‌కు చెందిన ఫోరెన్సిక్ సైకాలజీ గ్రాడ్యుయేట్ ఇండీ మెల్లింక్.

చిన్నప్పటి నుంచి ఇండీకి ప్లేయింగ్ కార్డ్స్ ఆడటమంటే చాలా ఇష్టం. వాళ్ల నాన్న సాయంతో వాటిని ఆడటం నేర్చుకున్న ఇండీ, ఇటీవల తన కజిన్స్‌కు ఆట నేర్పింది. ‘రాణి కంటే రాజు ఎందుకు విలువైనవాడు కావాలి?’ అనే అనుమానం ఆట ఆడుతున్న సమయంలో ఇండీకి వచ్చింది. పేకముక్కల ఆటలో శతాబ్దాలుగా వస్తున్న ‘లైంగిక అసమానతల’కు చెక్ చెప్పాల్సిన టైమ్ వచ్చిందని ఆమె అభిప్రాయపడగా..అందుకు వాళ్ల నాన్న సపోర్ట్ చేశాడు. దాంతో ఎన్నో ట్రయల్ అండ్ ఎర్రర్స్ తర్వాత ఇండీ లింగ రహిత(జెండర్‌లెస్) కార్డ్స్‌ను రూపొందించింది. కింగ్, క్వీన్, జాక్ స్థానాలను రిప్లేస్ చేస్తూ గోల్డ్, సిల్వర్, బ్రాంజ్‌(బీఎస్‌జీ)ను తీసుకొచ్చింది. 50 పేకముక్కలతో కూడిన న్యూ జీఎస్‌బీ కార్డ్స్‌ను ఆన్‌లైన్‌లో పెట్టగా, అమెరికా, జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్‌ దేశాలకు చెందిన 1,500 మంది వీటిని ఆర్డర్ చేశారు. గేమింగ్ షాప్స్ కూడా ఈ పేకముక్కలను ఆర్డర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయని ఇండీ తెలిపింది.

‘రాణి కంటే రాజు విలువైన వాడనే ఓ చిన్న మాట’ మనకు తెలియకుండానే మన దైనందిన జీవితంలోని ఎన్నో అంశాలను ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే ‘మీకు ప్రాముఖ్యత లేదు’ అని చెప్పేందుకు ఇదొక మార్గం. ఇలాంటి వాటికి అస్సలు చోటివ్వద్దని ఇండీ అంటోంది. ‘ఇది చాలా మంచి పరిణామం. అయితే ఒక్కసారిగా పాత పద్ధతుల నుంచి తప్పుకుని కొత్త కార్డులతో ఆడుతున్నప్పుడు కాస్త కష్టంగా అనిపిస్తుంది’ అని డచ్ బ్రిడ్జి అసోసియేషన్ హెడ్ బెరిట్ వాన్ డోబెన్ బర్గ్ తెలిపింది. ‘కార్డుల్లో జెండర్ ఇన్-ఈక్వాలిటీని గుర్తించడం నిజంగా అద్భుతం. ఇది నేనింత వరకు అబ్జెర్వ్ చేయని విషయం’ ‘కొత్త జనరేషన్ నిజంగా అద్భుతాలు చేస్తోంది. ఇది చాలా గొప్ప విషయం. జెండర్‌ ఈక్వాలిటీ తీసుకురావడంలో అందరం భాగమవుదాం’ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed